Sarkaru Vaari Paata కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. మరింత ఆలస్యంగా రాబోతున్న మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా విడుదల తేదీపై కూడా మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. మైత్రి మూవీ మేకర్స్ GMB ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గత ఏడాది నుంచి వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలు అందరూ కూడా చర్చలు జరిపిన అనంతరం ఒక్కొక్కరు ఒక్కో విడుదల తేదీ ని ఫిక్స్ చేసుకున్నారు సర్కారు వారి పాట కూడా వారికి తగ్గట్టుగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

మహేష్ లాంగ్ గ్యాప్

మహేష్ లాంగ్ గ్యాప్

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మరొక సినిమాను విడుదల చెందింది లేదు. కరోనా కారణంగా మొదటిసారి మహేష్ బాబు చాలా ఎక్కువగా వెండితెరకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక మొత్తానికి సర్కారు వారి పాట సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని మొదలుపెట్టిన మహేష్ బాబు అనుకోకుండా సినిమాను రెండు సార్లు వాయిదా వేసుకోవలసి వచ్చింది.

RRR కారణంగా

RRR కారణంగా


2020లో సర్కారు వారి పాట సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు 2021 సంక్రాంతికి ఎలాగైనా విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ సినిమా కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాకుండా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని షూటింగ్ కొనసాగించారు. కానీ మధ్యలో RRR సినిమా కారణంగా వాయిదా వేసుకోవలసి వచ్చింది.

పోటీ ఉండకూడదు అని..

పోటీ ఉండకూడదు అని..

సర్కారు వారి పాట ఒక డేట్ ను RRR సినిమా కోసం త్యాగం చేసినప్పటికీ కూడా అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. సంక్రాంతి ఎలాంటి పెద్ద సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. ఇక రానున్న రోజుల్లో చాలావరకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అలా ఉండవద్దు అని ముందుగానే చిత్రనిర్మాతలు అందరూ కూడా చర్చలు జరుపుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్నారు.

సర్కారు వారి పాట న్యూ డేట్ ఫిక్స్

సర్కారు వారి పాట న్యూ డేట్ ఫిక్స్


సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో మహేష్ బాబు స్టైల్ కూడా చాలా కూల్ గా ఉంది. మే నెలలో అయితే సర్కారు వారి పాటకు పెద్దగా పోటీ ఉండదు. అంతకు ముందు మాత్రం ఏప్రిల్ లో ఆచార్య భీమ్లా నాయక్ సినిమాలో భారీగా విడుదల కాబోతున్నాయి.

 ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా..

ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా..


ఇక సర్కారు వారి పాట సినిమాను గీత గోవిందం దర్శకుడు పరుశురాం డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంకు రికవరీ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలతో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంటుందట. ముఖ్యంగా అభిమానులు విజిల్స్ వేసే సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉంటాయని దర్శకుడు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X