Mahesh Babu సర్కారు వారి పాటకు మరో దెబ్బ.. అప్పుడు కూడా కష్టమే?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో సర్కారువారు పాట కూడా టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ ను మార్చుకుంది. ఫైనల్ గా జనవరి 13న వస్తుంది అనుకున్న ప్రేక్షకులకు మళ్ళీ నిరాశే ఎదురైంది. ఇక మళ్ళీ ఇటీవల ఏప్రిల్ ఒకటో తేదీ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ డేట్ కూడా వచ్చే అవకాశం లేదనే అనుమానాలు వస్తున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది.
Recommended Video

నాన్ స్టాప్ బ్రేకులు
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వెండితెరకు చాలాకాలం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా షూటింగ్ లకు నాన్ స్టాప్ గా బ్రేకులు ఇవ్వాల్సి వచ్చింది. గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ మహేష్ బాబూ ఇమేజ్ కు తగ్గట్టుగా సిద్ధం చేసిన సర్కారు వారి పాట పై ప్రస్తుతం అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది.

కరోనాతో ఎన్నో ఇబ్బందులు
నిజానికి సర్కారు వారి పాట షూటింగ్ మొదలైనప్పటి నుంచే అనేక సమస్యలతో కొనసాగుతోంది. ఎప్పుడు కూడా ఒక షెడ్యూల్ ను పర్ఫెక్ట్ ముందుకు సాగించింది లేదు. ఇప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. అంతేకాకుండా కొన్ని సార్లు షూటింగ్స్ క్యాన్సిల్ కావడం వలన మిగతా ఆర్టిస్ట్ లు దొరకడం కూడా కష్టంగా మారింది దానివల్ల కూడా చాలా సార్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

మిగతా సినిమాలు కూడా..
సర్కారు వారి పాట జనవరి 13వ తేదీన వస్తోందని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ ఆ సమయంలోనే RRR సినిమా వస్తుందని చెప్పడంతో మహేష్ బాబు రాజమౌళి వినతి ప్రకారం ముందుగానే వెనక్కి తగ్గాడు. అలా ముందుగానే క్లారిటీ ఇవ్వడం మంచిదైంది. ఇప్పటికే RRR సినిమాతో పాటు మిగతా సినిమాలు కూడా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.

అప్పుడు కూడా అనుమానమే..?
సర్కారు వారి పాట సినిమా తప్పకుండా ఏప్రిల్ 1న వస్తుందని నిర్మాతలు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సమ్మర్ హాలిడేస్ లో మొదటి నుంచి సర్కారు వారి పాట డామినేషన్ కూడా ఉంటుంది అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో మిగతా బ్యాలెన్స్ షూటింగ్ ను అప్పటిలోపు పూర్తి చేయడం కాస్త అనుమానంగానే ఉందట. అనుకున్న సమయానికి పూర్తి చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను అలాగే ప్రమోషన్ కు సమయం దొరికే అవకాశం చాలా తక్కువగా ఉందట.

ఆ డేట్ మిస్సయితే..
ప్రస్తుతం మహేష్ బాబు కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. కరోనా వ్యాప్తి మరింత ఎక్కువ కావడంతో షూటింగ్స్ సరిగా జరుగుతాయన్న నమ్మకం కూడా లేదు. సర్కారు వాడి పాట ఏప్రిల్ కి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఆ డేట్ మిస్సయితే మళ్ళీ పెద్ద సినిమాలతో తప్పక తలపడాల్సి ఉంటుంది. RRR, బీస్ట్, KGF ఈ సినిమాల్లో ఎదో ఒకటి మహేష్ SVP తో పోటీకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











