దేశవ్యాప్తంగా 'సర్కారు వారి పాట' .. మహేష్ సలహాతో డైరెక్టర్ కొత్త ప్లాన్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ 'సర్కారు వారి పాట' అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడు. దర్శకుడు పరశురామ్ మొదటిసారి మహేష్ ను డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాల డోస్ మరింత పెరిగింది. అయితే SVPను దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అంటే పాన్ ఇండియా తరహాలోనే సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు మహేష్ పాన్ ఇండియా ఫార్ములాను వాడలేదు. అప్పుడప్పుడు సినిమాలను డబ్బింగ్ తో ఇతర భాషల్లోకి రిలీజ్ చేయించాడు గాని పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక స్పైడర్ తో ద్విభాషా ఫార్ములాను గట్టిగానే వాడినప్పటికి వర్కౌట్ కాలేదు. మెయిన్ గా కథ నేషనల్ వైడ్ గా అందరిని ఆకర్షించేలా ఉంటే తప్పకుండా వర్కౌట్ అవుతుందని కొన్ని పాన్ ఇండియా సినిమాలు రుజువు చేశాయి.

Mahesh babu sarkaru vaari paata plans changed for pan india formula

ఇక సర్కారు వారి పాటలో మెయిన్ స్టోరీ అలాంటిదే. బ్యాంకులను ఎగ్గొట్టే బడా బాబులను బేస్ చేసుకొని దర్శకుడు కథను రాసుకున్నాడట. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి బిగ్ షాట్స్ మోసాలు కూడా సినిమాలో చూపించి దానికి సొల్యూషన్ కూడా స్టైలిష్ గా చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ కథను కేవలం తెలుగులో తెరకెక్కించాలని లోకల్ ఆడియెన్స్ ని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు కథను సెలెక్ట్ చేసుకున్నారు

అయితే ఇటీవల మహేష్ దర్శకుడితో కూర్చొని సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఎందుకు ప్లాన్ చేయకూడదు అనే ఆలోచనను కలిగించినట్లు తెలుస్తోంది. నిర్మాతలు కూడా అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో దర్శకుడు మళ్ళీ స్క్రిప్ట్ పై కూర్చున్నట్లు తెలుస్తోంది. నార్త్ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా సీన్స్ క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X