twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్కారు వారి పాట నుంచి మరో లీక్.. మహేష్ క్యారెక్టర్ అదే.. స్టోరీ ఇలా ఉంటుందట?

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అప్సెట్ అయితే మంచి క్రేజ్ అందుకున్నాయి. కేవలం ఫస్ట్ లుక్ టీజర్ అలాగే మొదటి పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మహేష్ బాబుకు సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. వీటితోనే సినిమాకు కావల్సినంత ప్రమోషన్ క్రియేట్ అయింది. ఇక రాబోయే అప్డేట్స్ అయితే మరింత బోనస్ అనే చెప్పాలి. అయితే సినిమాకు సంబంధించిన స్టోరీ ఇదే అంటూ.. మహేష్ బాబు పాత్ర కూడా ఇదే అని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

     చాలా గ్యాప్ ఇచ్చిన మహేష్

    చాలా గ్యాప్ ఇచ్చిన మహేష్

    సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అవుతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వీలైనంత త్వరగా మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా షూటింగ్ కు చాలా సార్లు బ్రేకులు పడ్డాయి. అంతేకాకుండా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటుండగా రాజమౌళి RRR కారణంగా ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే చివరికి కరోనా కారణంగా RRR కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

    కళావతి సెన్సేషన్

    కళావతి సెన్సేషన్

    మహానటి కీర్తిసురేష్ మొదటిసారి మహేష్ బాబు తో కలిసి నటిస్తుండడంతో ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని అర్థమయింది. ఎందుకంటే ఇటీవల వచ్చిన కళావతి లిరికల్ వీడియో సాంగ్ కూడా యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అత్యధిక వేగంగా వన్ మిలియన్ లైక్స్ అందుకున్న లిరికల్ వీడియో సాంగ్ గా కళావతి పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది.

     మొదటిసారి స్టార్ హీరోతో

    మొదటిసారి స్టార్ హీరోతో

    దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు పెద్ద హీరోలతో సినిమాలు చేయని ఈ దర్శకుడు మొదటి సారి మహేష్ బాబు ని డైరెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఎలాగైనా ఈ సినిమాతో విజయాన్ని అందుకుని అగ్ర దర్శకుల లిస్టులో చేరాలని చూస్తున్నాడు అని చెప్పవచ్చు.

    మహేష్ పాత్ర అదేనా?

    మహేష్ పాత్ర అదేనా?

    అయితే సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు అనే విషయంలో ఇప్పటివరకు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అతడు ఒక బ్యాంక్ లో రికవరీ ఎంప్లాయ్ గా కనిపిస్తాడని టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బ్యాంకు మోసాలు చేసే అతి పెద్ద బిజినెస్ మేన్ ల నుంచి కూడా హీరో చాలా తెలివిగా డబ్బులు లాగుతాడు అని టాక్ వచ్చింది.

    ఆ తరహాలో నవ్వించే పాత్రలో..

    ఆ తరహాలో నవ్వించే పాత్రలో..

    ఈ సినిమాలో మహేష్ జాలీ దయా లేని రికవరీ ఏజెంట్ గా బ్యాక్ ల నుంచి తీసుకున్న అప్పులను లాగుతూ ఉంటాడట. అయితే కళావతి వచ్చిన తర్వాత జీవితంలో అతని జీవితం ఒక్క సారిగా కీలక మలుపు తిరుగుతుందట. అంతేకాకుండా అమ్మాయిలు అంటేనే ఆమడ దూరం పారిపోయే పాత్రలో మహేష్ ఫస్ట్ హాఫ్ మొదట్లో కొంత సేపు నవ్విస్తాడట.

    కళావతి రాగానే..

    కళావతి రాగానే..

    అప్పటివరకు కమర్షియల్ ఆలోచించే హీరో కళావతి రాకతో అతని జీవితంలో ఒక్కసారిగా మార్పు చేసుకుంటుందట. కీర్తి సురేష్ ను అలా తెలుగమ్మాయి లాగా అందంగా చూసి ఫిదా అయిపోతాడట. ఇక అప్పటినుంచి హీరో క్యారెక్టర్ అనేక కోణాల్లో కథలో కీలక మలుపు తిరుగుతుందట. వినడానికి కాస్త రోటీన్ గానే ఉన్నా దర్శకుడు పరశురామ్ సరికొత్త మేకింగ్ తో ఆకట్టుకుంటాడు అని తెలుస్తోంది.

    English summary
    Mahesh babu sarkaru vaari paata story line mahesh charecter leak,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X