For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ విషయంలో మహేశ్ బాబు అసంతృప్తి: మళ్లీ జరిగితే ఊరుకోనని వార్నింగ్.. టాలీవుడ్‌లో కలకలం రేపిన మేటర్

  |

  ఈ మధ్య కాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా హ్యాట్రిక్ విజయాలను అందుకుని ఫుల్ ఫామ్‌తో ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా తన ప్రయాణాన్ని సాగిస్తోన్న ఈ స్టార్ హీరో.. మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, ఇప్పుడు 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తోన్న మహేశ్ బాబు.. ఓ విషయంలో అసంత‌ృప్తిగా ఉన్నాడట. అంతేకాదు, ఈ మేరకు కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఆ వివరాలు మీకోసం!

  సర్కారు వారి పాట పాడుతున్న మహేశ్

  సర్కారు వారి పాట పాడుతున్న మహేశ్

  సూపర్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.

   అప్పుడే అనుకుంటే.. వరుస ఆటంకాలు

  అప్పుడే అనుకుంటే.. వరుస ఆటంకాలు

  ‘సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అనివార్య కారణాలతో అది పట్టాలెక్కలేదు. ఆ వెంటనే పరశురాంతో ‘సర్కారు వారి పాట' చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పుడు కరోనా ప్రభావంతో ఇది వెంటనే ప్రారంభం కాలేదు. ఇక, ఈ ఏడాది ఆరంభంలో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. మళ్లీ గ్యాప్ వచ్చి ఇటీవలే రెండో మొదలైంది.

  కొత్త సినిమా కోసం మహేశ్ డేరింగ్ స్టెప్: సెంటిమెంట్ పక్కన పెట్టి.. కెరీర్‌లో తొలిసారి అక్కడ షూటింగ్‌

   అలాంటి నేపథ్యం... విమర్శనాత్మక కథ

  అలాంటి నేపథ్యం... విమర్శనాత్మక కథ

  ‘సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ విమర్శనాత్మకంగా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు.

   వేగంగా షూటింగ్... అప్పటికి పూర్తి చేసి

  వేగంగా షూటింగ్... అప్పటికి పూర్తి చేసి


  ‘సర్కారు వారి పాట' షూటింగ్ రెండో షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం పరిస్థితుల వల్ల భారతీయులకు ఆయా దేశాల్లో ప్రవేశం లేదు. దీంతో ఈ మూవీ షూటింగ్‌లో మార్పులు చేసి ఇక్కడే చిత్రీకరణ జరపాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఈ మూవీ సెకెండ్ షెడ్యూల్‌ను ప్రారంభించారు. దీన్ని సెప్టెంబర్ చివరికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

   ఆ విషయంలో మహేశ్ బాబు అసంతృప్తి

  ఆ విషయంలో మహేశ్ బాబు అసంతృప్తి

  తన వర్క్ విషయంలో మహేశ్ బాబు ఎంత పక్కాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమిట్‌మెంట్ ఇచ్చాడంటే అన్నీ కంప్లీట్ అయ్యే వరకూ నిద్రపోడు అన్న టాక్ కూడా ఉంది. అందుకే ఆయన కష్టం కూడా ఫ్యాన్స్‌కు కనిపించేలా పని చేస్తుంటాడు. అయితే, ‘సర్కారు వారి పాట' విషయంలో మాత్రం మహేశ్ బాబు అసంతృప్తిగా ఉన్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

  ఆ డైరెక్టర్‌తో హీరోయిన్ త్రిష పెళ్లి: ఇద్దరి మధ్య అలా మొదలైన ప్రేమ.. ముందే బయటకొచ్చిన మేటర్

  Mahesh Babu Biography, Life Style, Cars And Net Worth | Mahesh Babu Filmography | Filmibeat Telugu
   మళ్లీ జరిగితే ఊరుకోనంటూ గట్టి వార్నింగ్

  మళ్లీ జరిగితే ఊరుకోనంటూ గట్టి వార్నింగ్

  ‘సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో అంశాలు, ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. దీనిపైనే మహేశ్ బాబు అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. అలాగే, ఈ వ్యవహారం గురించి తాజాగా ఈ స్టార్ హీరో చిత్ర యూనిట్‌పై మండిపడ్డాడట. అంతేకాదు, మరోసారి ఏదైనా లీక్ అయితే బాగుండదని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ఓ న్యూస్ కలకలం రేపుతోంది.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Latest Report Says.. This Super Star Gave Serious Warning to SVP Team.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X