Mahesh Babu: ఇంటికి ఎవరు రాకుండా భారీ సెక్యూరిటీ.. అకస్మాత్తుగా అలా జరగడంతో కఠిన నిర్ణయం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిన విషయమే. స్టార్ హోదా ఎంత పెరిగినా కూడా తన కుటుంబ సభ్యులతో మాత్రం ఒక నార్మల్ పర్సన్ లా ఉంటాడు. ఇక కుటుంబ సభ్యుల బాగోగులపై ఎప్పటికప్పుడు మహేష్ ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక ఇటీవల ఒక సంఘటనతో మహేష్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదట.

బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

 మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం

మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం

మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం అభిమానులకు చాలా క్లోజ్ అయ్యిందనే చెప్పాలి. నమ్రత ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. కూతురు సితార పాప వారిద్దరి కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తుంటుంది. ఇక తనయుడు గౌతమ్ మాత్రం అందరికంటే ఎక్కువగా ప్రయివేట్ లైఫ్ ను ఇష్టపడతాడు.

చిన్నారుల కోసం

చిన్నారుల కోసం

మహేష్ బాబు సినిమాలతో కాకుండా ఎన్నో మంచి పనులతో కూడా అభిమానుల మనసును గెలుచుకున్నాడు. వెయ్యి మందికి పైగా చిన్నారుల గుండెలకు ఊపిరి పోశాడు. నమ్రత నేతృత్వంలో చిన్నారుల గుండె జబ్బులకు మహేష్ శస్త్ర చికిత్సలు చేయిస్తున్న విషయం తెలిసిందే.

 ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా

ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా

ఇక ఇటీవల మహేష్ కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటికి ఎవరిని రానివ్వకూడదని పూర్తిగా సెక్యూరిటీని పటిష్టం చేసినట్లు సమాచారం. ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు మహేష్ వారికి ఇంటివద్దే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కేవలం అవసరాలకు మాత్రమే ఒక వ్యక్తిని బయట నుంచి లోపలికి వచ్చేలా అది కూడా ఇంటి ముందు వరకే రావాలని నియమాలు పెట్టారట.

Recommended Video

SSMB 28 : అక్కినేని హీరో వైపు చూస్తున్న Trivikram, నో చెప్పే ఛాన్సే లేదు || Filmibeat Telugu
పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ..

పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ..

మహేష్ బాబును కలవడం కోసం రోజుకు చాలామంది వస్తుంటారు. బిజినెస్ పరంగా, సినిమాల పరంగా ఎన్నో రకాల ప్రముఖులు కూడా మహేష్ ఆఫీస్ డిస్కషన్ రూమ్ లో కలుసుకుంటారు. అయితే ఇటీవల ఇంటికి వచ్చి వెళ్లిన వారికి కరోనా ఉన్నట్లు అనుమానాలు రావడంతో వెంటనే మహేష్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ రిస్క్ చేయకూడదని కొన్ని రోజుల పాటు ఎవరిని రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X