Mahesh Babu సర్‌ప్రైజ్ లేనట్లేనా.. ఆ విషాద ఘటనతో మనసు మార్చుకున్న సూపర్ స్టార్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ లో మరో మంచి హిట్ అందుకొని అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. ఆ తరువాత వెంటనే మరొక సినిమాతో రావాలని అనుకున్నాడు కానీ కరోనా దెబ్బకు ప్లాన్ మొత్తం మారిపోయింది. ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. అయితే ప్రతి ఏడాది ఆనవాయితీగా చేస్తున్న ఒక విషయంలో మహేష్ ఈసారి ఒక విషాద ఘటనతో మనసు మార్చుకున్నట్లు టాక్ వచ్చింది.

అంతకు మించి అనేలా ఉండాలని
సౌత్ లోనే అత్యదిక మార్కెట్ ఉన్న హీరోలలో ఒకరైన మహేష్ బాబు రానున్న రోజుల్లో మరింత బిజీ కానున్నాడు. ప్రతి సినిమా కూడా అంతకు మించి అనేలా ఉండాలని కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే కరోనా వల్ల బ్రేక్ పడింది.

క్లారిటీ అయితే లేదు
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాను మొదట ఈ ఏడాది దసరా సమయంలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యంగా స్టార్ట్ కావడంతో 2022 సంక్రాంతిపై ఫోకస్ పెట్టారు. కానీ అప్పుడు కూడా సినిమా వస్తుందా రాదా అనే విషయంలో క్లారిటీ అయితే లేదు. సినిమా షూటింగ్ అనుకున్నట్లుగా కొనసాగితేనే రిలీజ్ పై క్లారిటీ వస్తుంది.

త్రివిక్రమ్ కూడా
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. రాజమౌళి ప్రాజెక్ట్ మొదలవ్వగా ముందే ఈ సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. త్రివిక్రమ్ కూడా మహేష్ కు సరిపోయే విధంగా పవర్ఫుల్ స్టోరీని సెట్ చేసినట్లు తెలుస్తోంది.

మనసు మార్చుకున్న సూపర్ స్టార్స్
అయితే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 31న మహేష్ రెండు సినిమాలకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లు రానున్నట్లు మొన్నటి వరకు టాక్ ఒక రేంజ్ లో టాక్ వచ్చింది. అది నిజమే అయినప్పటికీ మళ్ళీ మహేష్, కృష్ణ ఇద్దరు కూడా మనసు మార్చుకొని ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారట.
Recommended Video

ఆ విషాద ఘటన వలన.. అప్డేట్స్ ఉండవు?
ప్రతి ఏడాది కూడా మే 31 వచ్చింది అంటే మహేష్ ఎదో అప్డేట్ ఇచ్చేవారు. కానీ ఈసారి టాలీవుడ్ సీనియర్ PRO బీఏ.రాజు మృతి చెందడంతో మహేష్ అప్డేట్స్ క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్ బాబు వరకు రాజుగారు అన్ని సినిమాలకు PRO గా ఉండి ఒక కుటుంబ సభ్యుడిలా ఘట్టమనేని వారికి దగ్గరయ్యాడు. అందుకే మహేష్ ఈ విషాద సమయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మే 31వరకు ఎదురుచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











