ఫ్యాన్స్‌కు షాకిస్తున్న....మహేష్ బాబు ఫోటో
సూపర్ స్టార్ మహేష్ బాబు.... ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా హీరోలందరిలోకెల్లా అందగాడిగా, మిల్కీ బాయ్ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చాలా సినిమాల్లో మహేష్ బాబు గ్లామర్‌పై పొగడ్తలు ఉన్నాయి. అసలు తెరపై మహేష్ బాబు గ్లామర్ ధాటికి హీరోయిన్లకు సరైన మార్కులు పడటం లేదనే వాదన కూడా ఉంది. ఇక రియల్ లైఫ్‌లో మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ముఖ్యంగా మహిళా అభిమానుల సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా మంది అమ్మాయిలు మహేష్ బాబు లాంటి అందగాడు కావాలని కలలు కంటుంటాడు. మరి సూపర్ స్టార్‌కు ఉన్న అందం అలాంటిది.
అయితే మహేష్ బాబు అభిమానులందరికీ షాకిస్తూ...ఫేస్ బుక్‌లో ఓ ఫోటో దర్శనం ఇస్తోంది. ఇదే మహేష్ బాబు రియల్ గెటప్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ఫోటోలో మహేష్ బాబు డీ గ్లామరస్‌గా, బట్టతలతో ఉండటం చూసి అంతా షాకవుతున్నారు. అయితే అది మార్ఫింగ్ ఫోటోనా? లేక రియల్ ఫోటోనా? అనేది తేలాల్సి ఉంది.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. వెంకటేష్, మహేష్ బాబులతో మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత, వెంకీ సరసన జర్నీ ఫేం అంజలి నటిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ట్యూన్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్‌లు కలిసి రెడీ చేశారు.


Click it and Unblock the Notifications