అందుకే...మహేష్ బాబుకి ఆ రేంజి ప్రస్టేషన్?
సైనికుడు, అతిధి చిత్రాలు వచ్చి దాదాపు మూడేళ్లు కావటం, ఓ ప్రక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రారంభించిన చిత్రం ఓ కొలిక్కి రాకపోవటం మహేష్ ని చాలా ఇరిటేషన్ కి గురిచేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అంతేగాక నెక్ట్స్ చిత్రాల కోసం వింటున్న కథలు కూడా ఏదీ తృప్తిగా లేకపోవటం ఆయన్ని మరింత చిరాకుకు పెడుతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఎక్సయిట్ మెంట్ కు గురిచేసే కథలు చెప్పలేకపోతున్నారని, అన్నీ తన గత చిత్రాల కలపోతలా ఉంటున్నాయని వాపోతున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవటంతో పరిశ్రమలోని వ్యక్తులు కామెంట్స్, జోక్స్ వినాల్సి వస్తోందని ఆయన శ్రేయాభిలాషులు చెప్తున్నారు. ఇక శ్రీను వైట్ల చిత్రం కూడా కథ పూర్తిగా కన్ఫర్మ్ కాలేదని మరో వార్త వినపడుతోంది. మరో ప్రక్క పెద్ద నిర్మాతలుకూడా ఎప్పుడు సినిమా ఎవరితో ఒప్పుకుంటాడో తెలియని స్ధితిలో మహేష్ ఉన్నారని ఎవరూ డేట్స్ కోసం ముందుకు వెళ్ళటం లేదు. ఏదైమైనా మహేష్ ప్రస్టేషన్ లో ఉన్నారని, ఓ సూపర్ హిట్ దానికి మందు అనేది అందరి మాట.


Click it and Unblock the Notifications











