కొత్త చిత్రం కమిట్ అయిన మహేష్ ..డిటేల్స్
తాజాగా మహేష్ బాబు మరో కొత్త చిత్రం చేయటానికి సైన్ చేసారు. రవితేజతో మిరపకాయ చిత్రం నిర్మిస్తున్న యల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతుంది. జాస్తి హేమాంబర్..మహేష్ బాబుకి క్లోజ్ ప్రెండ్ అయిన అశోశియేట్ డైరక్టర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. నిర్మాత రమేష్ పుప్పాల త్వరలో ఈ విషయాన్ని మీడియాకు తెలియచేయనున్నారు. ఇక ప్రస్తుతం యూనిట్..కధకు తగ్గ హీరోయిన్ కోసం సెర్చింగ్ జరుపుతున్నారు. ప్రస్తుతం మహేష్ తో ఖలేజాతో బిజీగా ఉన్న మహేష్ ఈ చిత్రం అనంతరం శ్రీను వైట్ల చిత్రం మొదలెడతారు. ఇక జాస్తి దర్శకత్వంలో మహేష్ గతంలోనే (2007 డిసెంబరులో) 'మిర్చి' అనే టైటిల్ తో ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారు. మిర్చిని దుర్గా ఆర్ట్స్ బానర్ పై కెఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాలని సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ను, ఆర్ట్ డైరెక్టర్ గా అశోక్ ను ఎంచుకున్నారు. హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్‌ను నిర్మించడానికి అశోక్ పనులు కూడా మొదలుపెట్టాడు.అయితే అప్పుడు స్క్రిప్టు సంతృప్తిగా రాకపోవటంతో ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్ళకు కథ మొదలైంది. ఈ సారన్నా సినిమా ఆగకుండా పూర్తయ్యి హిట్టు సినిమా వస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











