మహేష్ సిక్స్ ప్యాక్ తో అమ్మాయిలు మటాష్...!
తన తోటి హీరోలు, తర్వాతి తరం హీరోలు బాడీ పెంచి సిక్స్ ప్యాక్ లతో ఇరగదీస్తోంటే, తన శరీరాన్ని మాత్రం కనీసం అయిదారు చొక్కాలు ఒకేసారి వేసుకుని కప్పేసుకునే మహేష్ బాబు కూడా ఇప్పుడు బాడీ పెంచే పనిలో పడ్డాడు. దూకుడు తర్వాత పూరి డైరెక్షన్ లో నటించే ది బిజినెస్ మ్యాన్ కోసం మహేష్ బాడీ పెంచుతున్నాడు. మరి అది కేవలం క్యారెక్టర్ కోసం అవసరమైన దృడత్వం కోసమా లేక నిజంగానే సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించడం కోసమా అనేది తెలీలేదు.
మొత్తానికి కండలు తిరుగుతున్న మహేష్ శరీరమైతే అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది. ఇంతదాకా తన శరీరాన్ని కొంచెం కూడా ప్రదర్శించని మిల్క్ బాయ్ మహేష్ నిజంగా సిక్స్ ప్యాక్ బాడీతో కనుక చొక్కా విప్పితే అమ్మాయిల పని మటాష్ అయిపోతుందనడంలో సందేహం లేదు. మామూలుగా కనిపిస్తేనే మహేష్ అంటే పిచ్చేత్తిపోయేసరికి అతను టాప్ లెస్ గా కనిపిస్తే తట్టుకోగలరా..!
More from Filmibeat
mahesh babu the businessman puri jagannath dookudu samantha మహేష్ బాబు ది బిజినెస్ మేన్ పూరి జగన్నాథ్ దూకుడు సమంత


Click it and Unblock the Notifications











