దూకుడులో మహేష్ ..తెలంగాణ కనెక్షన్
తెలంగాణ వాదుల నుంచి తలనొప్పులు తన తాజా చిత్రం దూకుడుకి ఎదురవ్వకుండా ఉండటానికి మహేష్ అన్ని జాగ్రత్లలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులో మహేష్ కొన్ని సీన్స్ లో తెలంగాణ స్లాంగ్ మాట్లాడనున్నారు. ఇందులో మహేష్ తెలంగాణకు చెందిన ఎమ్మల్యేగా కనపడతారు. సెకెండాఫ్ లో వచ్చే ఈ సన్నివేశాల్లో మహేష్ పూర్తిగా తెలంగాణలో మాట్లాడి ఆకట్టుకోనున్నారు. ఇంతకుముందు ఖలేజాలోనూ మహేష్ ఓ డిఫెరెంట్ స్లాంగ్ లో అలరించారు. అలాగే సినిమాలో చాలా సీన్స్ లో మహేష్ తో బ్రహ్మానందం కనపించి నవ్వించనున్నారు. దూకుడు సినిమా పోకిరి లాగానో, ఒక్కడు లాగానో ఉండాలని డిజైన్ చెయ్యలేదు. మంచి ఎమోషన్, కామిడీ ని కలిపి బ్లెండ్ చేస్తూ చెప్పిన ఒక కొడుకు కథ అంటున్నారు రచయిత గోపీ మోహన్. ఆయన ఈ చిత్రం గురించి తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఇలా ట్వీట్ చేసారు. అలాగే బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు.
ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు అంటున్నారు రైటర్ గోపీమోహన్. అలాగే ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











