Vijay మహేష్ బాబు కాంబినేషన్.. ఇది నిజమైతే బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!

ఇటీవల కాలంలో భాష తో సంబంధం లేకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి గుర్తింపు అయితే అందుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలకు అయితే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతోంది. ఇక తమిళ హీరోలు ముందుగానే టాలీవుడ్ లో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. కానీ విజయ్ కు మాత్రం అనుకున్నంత స్థాయిలో సరైన గుర్తింపు రాలేదు. ఇక తదుపరి సినిమాతో మాత్రం అతను మార్కెట్ ను పెంచుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఆ సినిమాలో విజయ్ తో పాటు మహేష్ బాబు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగులో కూడా..

తెలుగులో కూడా..


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మెల్లగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు అతను నటించిన మాస్టర్ సినిమా తెలుగులో ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పది కోట్ల మార్కెట్ ఏర్పడడంతో ఆ మధ్య వచ్చిన సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.

నెక్స్ట్ వారసుడు..

నెక్స్ట్ వారసుడు..

కానీ బీస్ట్ సినిమాకు అనుకున్నంతగా పాజిటివ్ టాక్ రాకపోవడంతో పూర్తిస్థాయిలో పంపిణీదారులకు మాత్రం లాభాలను అందించలేకపోయింది. ఇక ఎలాగైనా నెక్స్ట్ వారసుడు సినిమాతో మాత్రం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని విజయ్ ఫిక్స్ అయ్యాడు. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా వారసుడు సినిమా తమిళం లోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది.

భారీగా రెమ్యునరేషన్

భారీగా రెమ్యునరేషన్

ఈ సినిమాపై విజయ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి మహర్షి తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 90 కోట్లకు పైగానే పారితోషికం కూడా తీసుకున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది సంక్రాంతికి

వచ్చే ఏడాది సంక్రాంతికి

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ అయితే పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం వైరల్ గా మారుతోంది.

మహేష్ బాబు అతిధి పాత్రలో

మహేష్ బాబు అతిధి పాత్రలో


ఎందుకంటే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అతిథి పాత్ర కోసం మహేష్ బాబును అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళంలో విజయ్ కు ఎలాంటి క్రేజ్ అయితే ఉందో తెలుగులో మహేష్ బాబు కూడా అదే తరహా అభిమానం అయితే ఉంది. కాబట్టి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఊహించని రేంజ్ లో ఉంటాయి అని చెప్పవచ్చు.

సపోర్ట్ పెరిగే అవకాశం..

సపోర్ట్ పెరిగే అవకాశం..


అంతే కాకుండా మహేష్ బాబు కూడా తమిళంలో విజయ్ అభిమానుల నుంచి సపోర్ట్ కూడా పెరుగుతుంది. అలా చేస్తే రాజమౌళి తో చేయబోయే సినిమాకు కూడా ఎంతోకొంత ఉపయోగపడుతుంది. కాబట్టి మహేష్ బాబు ఈ సినిమాలో నటించే అవకాశం ఉండవచ్చు. అంతకంటే ముందుగానే డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో కూడా మహేష్ బాబుకు మంచి స్నేహం ఉంది. కాబట్టి కాంబినేషన్ నిజం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X