twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు...'పవర్' పోయి 'దూకుడు' వస్తోందా?

    By Srikanya
    |

    మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రెడీ కానున్న చిత్రానికి 'పవర్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడా టైటిల్ తీసేసి 'దూకుడు' అనే టైటిల్ ని పెట్టనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంతా హీరోయిన్ గా చేస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్...త్రివిక్రమ్ దర్సకత్వంలో చేస్తున్న చిత్రం పూర్తి కావచ్చింది. అయితే ఇప్పటివరకూ ఈ చిత్రానికి టైటిల్ ఖరారు కాలేదు.అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రంలో మహేష్..టాక్సీ డ్రైవర్ గా కనపడనున్నారు. శ్రీను వైట్ల స్వయంగా కథ అందిస్తున్న ఈ చిత్రానికి కోనవెంకట్ డైలాగులు అందిస్తున్నారు అలాగే ఈ చిత్రాన్ని ఎ టీవీ..అనీల్ సుంకర నిర్మిచనున్నారు. అనీల్ సుంకర ఇంతకుముందు వెంకటేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నమో వెంకటేశ, మంచు మనోజ్ తో బిందాస్ చిత్రాలు రూపొందించిన సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X