Animal: హిట్ అని అరిచి చెప్పే జక్కన్న, మహేష్... యానిమల్ విషయంలో అందుకే సైలెంట్ అయ్యారా?
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా... రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం యానిమల్. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంటుకు మహేశ్ బాబు, రాజమౌళి వచ్చి హైప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను అందరికంటే ముందే చూస్తామంటూ చెప్పుకువచ్చారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక.. ఈ సినిమాపై స్పందించకపోవడం.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. వీళ్లింద్దరికి నిజంగా సినిమా నచ్చలేదా.. లేదా ఆ విషయం వల్లే ఈ సినిమాపై స్పందించడం లేదా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటో ఈస్టోరీలో తెలుసుకుందాం.
యానిమల్ సినిమా మహేష్ బాబు, రాజమౌళికి నచ్చలేదా? అనే ప్రశ్న సినీ ప్రియులను ఉత్కంఠకు గురిచేస్తోంది. యానిమల్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేష్ బాబు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో వారు సినిమాను చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పుకువచ్చారు. టీజర్‌ని చూసిన తర్వాత... ఈ సినిమా తప్పక చూడాల్సిన సినిమా అని భావించామని తెలిపారు. ఇక యానిమల్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఎప్పుడెప్పుడూ ఈ సినిమాను చూడాలనే ఆతృతతో ఉన్నట్లు దర్శకధీరుడు చెప్పుకువచ్చారు. అప్పటి వరకు వేచి ఉండలేను... ప్రేక్షకుల ముందే చూస్తాను అని వెల్లడించారు. డిసెంబర్ 1, 2 తేదీల్లో బిజీగా ఉండటం వల్ల నవంబర్ 30 తారిఖునే చూస్తాని రాజమౌళి తెలిపారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం.. ఈ సినిమాను చూడాలనే ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు. ప్రతి ఆర్టిస్ట్ పనితీరుని ఆయన ప్రశంసించారు.
దీంతో ఈ సినిమాపై ఫస్ట్ రివ్యూ మహేశ్ బాబు, రాజమౌళిలది ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో ఎలాంటి స్పందన కానీ.. రియాక్షన్ కానీ ఇప్పటి వరకు పెట్టలేదు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలకు వరకు సినిమా బాగుంటే.. హిట్ అని అరిచి చెప్పే మహేశ్ బాబు, రాజమౌళి.. మరి యానిమల్ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారు.. నిజంగానే సినిమా నచ్చలేదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

యానిమల్ సినిమా రిలీజ్ అయి మూడు రోజులు అయినా... ఈ సినిమాపై ఎలాంటి పోస్ట్ చేయలేదు రాజమౌళి, మహేశ్ బాబు. సినిమా చిన్నదే అయినా నచ్చితే మహేష్ బాబు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో సినిమా రివ్యూలను పోస్ట్ చేస్తుంటాడు, కానీ యానిమల్ విషయంలో కూడా సైలెంట్‌గా ఉన్నాడు. యానిమల్ సినిమా మహేష్ బాబు, రాజమౌళికి నచ్చలేదనే సందేహం కొంతమందికి కలుగుతుంది.
అయితే ఈ సినిమాలో అడల్ట్ కంటెంటె వల్లే రాజమౌళి, మహేశ్ బాబు స్పందించడం లేదని అంటున్నారు కొంత మంది నెటిజన్లు. కొంత అడల్ట్ కంటెంట్ ఉండటంతో ఎలాంటి వివాదాలు రాకుండా సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ మహేష్, రాజమౌళి...సైలెంట్ అవ్వడం వెనుక కారణం అదేనని అనుకుంటున్నారు. ఇక ఎప్పుడు స్పందిస్తారో చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











