Mahesh Babu & SS Rajamouli Movie Budget: RRR మూవీ చిన్నబోయేలా.. ఇండియాలోనే ఫస్ట్ టైమ్ ఇలా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లను ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయిక ఒకటి. ఎంతో కాలంగా వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారని సినీ ప్రియులు, ఫ్యాన్స్ వేచి చూస్తున్నా.. అది మాత్రం సాధ్యం కాలేదు. ఇలాంటి సమయంలో గత ఏడాదే వీళ్ల కాంబోలో సినిమా రాబోతుందని ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి ఈ సినిమాపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి సెన్సేషనల్ న్యూస్ ఒకటి లీకైంది. ఆ సంగతులు మీకోసం!

ఇద్దరూ రెండు సినిమాలతో బిజీగా
కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని పరశురాం తీస్తున్నాడు. మరోవైపు, రాజమౌళి ప్రస్తుతం RRR అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇది పది భాషల్లో విడుదల కాబోతుంది.

క్రేజీ ప్రాజెక్టును ప్రకటించిన జక్కన్న
పోయిన ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, అదెప్పుడు మొదలవుతుందనేది చెప్పలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఏ జోనర్‌లో రూపొందనుంది? ఏ రేంజ్‌లో దీన్ని తీస్తారు? అనే దానిపై ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.

తండ్రికి బాధ్యతలు అప్పగించేశాడు
మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేందుకు అదిరిపోయే స్క్రిప్ట్‌తో రావాలని వీళ్లిద్దరూ నిర్ణయించారట. ఇందులో భాగంగానే కథకు సంబంధించిన బాధ్యతలను తన తండ్రి, సీనియర్ రైటర్ విజయేంద్రప్రసాద్‌కు అప్పగించాడు జక్కన్న. చాలా రోజులుగా ఆయన దీనిపై పని చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అలాంటి కథ.. ఇలాంటి నేపథ్యమని
ఈ ప్రాజెక్టు గురించి రాజమౌళి ప్రకటించినప్పటి నుంచే దీనిపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి కూడా ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని అన్నారు. కానీ, ఇది రాజుల కాలం నాటి స్టోరీతో వస్తుందని.. ఇందులో మహేశ్ శివాజీగా నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

జక్కన్న ప్లాన్.. మహేశ్ మరో దాంతో
RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై మూడేళ్లు కావొస్తుంది. అయినప్పటికీ ఈ మూవీ చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఈ భారమంతా తీర్చుకునేందుకు రాజమౌళి తర్వాతి సినిమాకు ముందు గ్యాప్ తీసుకోబోతున్నారట. అందుకే మహేశ్ బాబు.. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇది పూర్తయ్యాకే అది మొదలవుతుందట.

మహేశ్ కోసం రాజమౌళి డేరింగ్ స్టెప్
మహేశ్ బాబు.. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న బడా ప్రాజెక్టును కేఎల్ నారాయణ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. దీన్ని ఖర్చుకు వెనుకాడకుండా ఆయన తీయబోతున్నారట. అందుకు అనుగుణంగానే రాజమౌళి కూడా భారీ ప్లాన్లు వేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీని కోసం ఆయన బడ్జెట్ విషయంలో డేరింగ్ స్టెప్ వేసినట్లు తెలిసింది.
Recommended Video

RRR కంటే ఎక్కువ.. ఫస్ట్ టైమ్ ఇలా
తాజా సమాచారం ప్రకారం.. రాజమౌళి - మహేశ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా దాదాపు రూ. 400 -500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇది RRR కంటే ఎక్కువ మొత్తం అని అంటున్నారు. అంతేకాదు, ఇండియాలోనే ఇంత భారీ మొత్తంతో ఇప్పటి వరకూ సినిమా రాలేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించొచ్చు.


Click it and Unblock the Notifications











