మహేశ్ - రాజమౌళి మూవీపై షాకింగ్ న్యూస్: అలా డిసైడ్ అయిన స్టార్లు.. బడా ప్రాజెక్టుపై అనుమానాలు

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లు ప్రత్యేకమైనవిగా నిలుస్తుంటాయి. వాటిలో కొన్ని అప్పటికే సినిమాలు చేసినవై ఉంటాయి.. మరికొన్ని మాత్రం పలానా వారి కలయికలో సినిమా వస్తే చూడాలన్న ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టర్ మహేశ్ బాబు కాంబో ఒకటి. చాలా కాలంగా వీళ్లిద్దరి సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మూవీ చేస్తున్నామని జక్కన్న ప్రకటించేశాడు. అప్పటి నుంచి దీనిపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

 రాజమౌళి అలా.. మహేశ్ బాబు ఇలా బిజీగా

రాజమౌళి అలా.. మహేశ్ బాబు ఇలా బిజీగా

వరుస విజయాలతో దూసుకుపోతోన్నాడు మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు, రాజమౌళి ప్రస్తుతం RRR అనే సినిమా చేస్తున్నాడు. ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది.

మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా ప్రకటన

మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా ప్రకటన

గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, అదెప్పుడు మొదలవుతుందనేది చెప్పలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఏ జోనర్‌లో రూపొందనుంది? ఏ రేంజ్‌లో దీన్ని తీస్తారు? అనే దానిపై ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఎన్నో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

మహేశ్ బాబు మూవీ పనిలో విజయేంద్రుడు

మహేశ్ బాబు మూవీ పనిలో విజయేంద్రుడు

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేందుకు అదిరిపోయే స్క్రిప్ట్‌తో రావాలని వీళ్లిద్దరూ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే స్టోరీ బాధ్యతలను తన తండ్రి, సీనియర్ రైటర్ విజయేంద్రప్రసాద్‌కు అప్పగించాడు జక్కన్న. ఇప్పటికే కొన్ని స్టోరీ లైన్లను కూడా ఆయన సిద్ధం చేశారని ఆ మధ్య ప్రచారం జరిగింది.

కథ ఇదేనంటూ ప్రచారం.. ఊహించని పాత్రలో

కథ ఇదేనంటూ ప్రచారం.. ఊహించని పాత్రలో

క్రేజీ కాంబినేషన్ కావడంతో మహేశ్ బాబు - రాజమౌళి సినిమాపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి కూడా ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని అన్నారు. కానీ, ఇది రాజుల కాలం నాటి స్టోరీతో వస్తుందని.. ఇందులో మహేశ్ శివాజీగా నటిస్తున్నాడని అంటున్నారు.

RRR మూవీ తర్వాత జక్కన్న ఫ్యామిలీ ప్లాన్

RRR మూవీ తర్వాత జక్కన్న ఫ్యామిలీ ప్లాన్

దాదాపు రెండు సంవత్సరాల క్రితం RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురవడం వల్ల పలుమార్లు ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఇక, ఈ ఏడాది ప్రథమార్ధంలో షూట్ కంప్లీట్ చేసి.. ప్రకటించిన సమయానికి విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. దీని తర్వాత దాదాపు ఏడాది పాటు రాజమౌళి విశ్రాంతి తీసుకోకున్నారని టాక్.

మహేశ్ - రాజమౌళి మూవీపై షాకింగ్ న్యూస్

మహేశ్ - రాజమౌళి మూవీపై షాకింగ్ న్యూస్

మహేశ్ బాబుతో రాజమౌళి చేసే సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అంతా అనుకున్నట్లు ఈ సినిమా 2022లో ప్రారంభం కావడం లేదట. ఇప్పుడు కరోనా వల్ల షూటింగులు వాయిదా పడడంతో పాటు మహేశ్ 'సర్కారు వారి పాట' తర్వాత మరో రెండు సినిమాలు చేస్తున్నాడట. దీంతో ఈ భారీ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై క్లారిటీ రావట్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X