మహేశ్ కోసం ప్లాన్ మార్చిన రాజమౌళి: అనుకున్న దానికంటే ముందుగానే.. ప్రాజెక్టు కోసం తొలిసారి ఇలా!
తెలుగు ప్రేక్షకులు చాలా కాలంగా ఆసక్తిగా వేచి చూస్తోన్న కాంబినేషన్‌లలో దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబు జోడీ ఒకటి. దర్శకుడిగా ఆయన.. హీరోగా ఈయన టాప్ ప్లేస్‌లో వరుస సినిమాలతో సత్తా చాటుతూనే ఉన్నారు. అలాంటి వీళ్లిద్దరి కలయికలో సినిమా అంటే ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టుపై చాలా కాలంగా ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ భారీ చిత్రం నుంచి ఓ ఊహించని న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మహేశ్ అలా.. రాజమౌళి ఇలా బిజీగా
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే, రాజమౌళి ఇప్పుడు RRRను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ రేంజ్‌తో విడుదల కాబోతుంది.

మహేశ్‌తో ప్రాజెక్టు ప్రకటించిన జక్కన్న
ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న కాంబినేషన్‌పై రాజమౌళి గత ఏడాది ప్రకటన చేశాడు. తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్నట్లు అందులో వెల్లడించాడు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారని కూడా పేర్కొన్నాడు. అయితే, ఈ సినిమా నేపథ్యం గురించి మాత్రం ఆయన ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

విజయేంద్రుడి చేతిలో కీలక బాధ్యతలు
క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించాడట జక్కన్న. ఆయన చాలా రోజులుగా ఈ మూవీ కథపై వర్క్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు కూడా.

సినిమా కథ.. రెండు నేపథ్యాలు అంటూ
రాజమౌళి.. మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అందులో ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని.. రాజుల కాలం నాటి స్టోరీతో వస్తుందని.. అడ్వెంచర్ కథతో తెరకెక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి సూచనతో మహేశ్ మరొకటి
వాస్తవానికి రాజమౌళి.. మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఈ ఏడాది ద్వితియార్థంలోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా RRR వాయిదా పడడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతోంది. ఇక, రాజమౌళి సూచన మేరకు మహేశ్ బాబు.. త్రివిక్రమ్‌తో సినిమాను చేస్తున్నాడని అంటున్నారు. దీని తర్వాత అది మొదలవుతుందట.

మహేశ్ కోసం ప్లాన్ మార్చిన రాజమౌళి
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా RRR మూవీ మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో లాక్‌డౌన్‌లు తీసేస్తున్నారు. దీంతో ఈ మూవీని అనుకున్న సమయానికే అంటే అక్టోబర్‌లోనే విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుతో చేసే సినిమా విషయంలో రాజమౌళి ప్లాన్ మార్చేశాడని తెలుస్తోంది.
Recommended Video

అనుకున్న దాని కంటే ముందు సిద్ధం
తాజా సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు.. రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమాను వచ్చే సంక్రాంతికి అధికారికంగా ప్రకటించబోతున్నారట. అంతేకాదు, ఆ వెంటనే అంటే ఆ నెలలోనే రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అప్పటి కల్లా మహేశ్ త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసేస్తాడట. రాజమౌళి కూడా తొలిసారి గ్యాప్ తీసుకోవట్లేదని సమాచారం.


Click it and Unblock the Notifications











