రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయిక ఒకటి. టాలీవుడ్‌లో వీళ్లిద్దరి కాంబినేషన్ కోసం అటు సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేశ్‌తో సినిమా చేస్తున్నట్లు రాజమౌళి గత ఏడాది అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ స్టోరీ విషయమై ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

మహేశ్ బాబు అలా.. రాజమౌళి ఇలా బిజీ
'సరిలేరు నీకెవ్వరు'తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబు.. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. జనవరి మూడో వారం నుంచి ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు, రాజమౌళి ప్రస్తుతం RRR అనే సినిమా చేస్తున్నాడు. ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

రాజమౌళి కంటే ముందే రెండు సినిమాలు
లాక్‌డౌన్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, అదెప్పుడు మొదలవుతుందనేది చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' తర్వాత మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడట. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతోనూ మూవీ ఉంటుందని తెలిసింది.

RRR తర్వాత గ్యాప్ తీసుకోనున్న జక్కన్న
దాదాపు రెండు సంవత్సరాల క్రితం RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురవడం వల్ల పలుమార్లు ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఇక, ఈ ఏడాది ప్రథమార్ధంలో షూట్ కంప్లీట్ చేసి.. దసరా కల్లా సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. దీని తర్వాత దాదాపు ఏడాది పాటు రాజమౌళి విశ్రాంతి తీసుకోకున్నారని టాక్.

తండ్రికి బాధ్యతలు అప్పగించిన రాజమౌళి
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేందుకు అదిరిపోయే స్క్రిప్ట్‌తో రావాలని వీళ్లిద్దరూ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే స్టోరీ బాధ్యతలను తన తండ్రి, సీనియర్ రైటర్ విజయేంద్రప్రసాద్‌కు అప్పగించాడు జక్కన్న. ఇప్పటికే కొన్ని స్టోరీ లైన్లను కూడా ఆయన సిద్ధం చేశారని ఆ మధ్య ప్రచారం జరిగింది.

రాజమౌళి-మహేశ్ మూవీ.. షాకింగ్ న్యూస్
క్రేజీ కాంబినేషన్ కావడంతో మహేశ్ బాబు - రాజమౌళి సినిమాపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి కూడా ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి ఓ షాకింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
తాజా సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు - రాజమౌళి సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ కథతో రూపొందనుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ స్టోరీ లైన్‌ను విజయేంద్రప్రసాద్ రెడీ చేయడం.. అది జక్కన్నకు నచ్చడం జరిగాయని తెలిసింది. అంతేకాదు, ఈ సినిమాలో మహేశ్ బాబు శివాజీ పాత్రను పోషించబోతున్నాడని అంటున్నారు. దీంతో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











