SS.Rajamouli - mahesh babu: మరొక సెంటిమెంట్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్ సెట్స్ పైకి వస్తున్నాయి. మొదటిసారి అగ్ర దర్శకులు మునుపెన్నడూ లేని విధంగా స్టార్ హీరోల కోసం సినిమాలను సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ బాబు కూడా మెల్లగా అదే బాటలోకి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ ప్రాజెక్టు అనంతరం వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక యాక్షన్ డ్రామాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. అతడు ఖలేజా వంటి భిన్నమైన సినిమాల తర్వాత తెరపైకి రాబోతున్న ఈ కాంబినేషన్ పై కూడా సౌత్ ఇండస్ట్రీలో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

అయితే ప్రస్తుతం చాలా వరకు అగ్ర దర్శకులు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇంకా లోకల్ గానే అడుగులు వేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కే అవకాశం ఉన్నట్లు కథనాలు అయితే వస్తున్నాయి. అయితే ఇంకా ఆ విషయంలో చిత్ర యూనియ్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక మరో వైపు మహేష్ బాబుతో రాజమౌళి కూడా యాక్షన్ అడ్వెంచర్ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ సినిమా ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు.

Mahesh babu ss rajamouli project latest update launch date

ఇక ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న RRR సినిమా విడుదల అయితే మహేష్ బాబు సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో మహేష్ బాబుతో సినిమా కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ వచ్చే ఏడాది ఒక స్పెషల్ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రీప్రొడక్షన్ పనులు కోసమే దర్శకుడు ఎక్కువగా వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అలాగే మహేష్ బాబు కూడా ఫిట్నెస్ లో కాస్త మార్పులు కూడా చేసే అవకాశం ఉందట. అంతేకాకుండా కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులతో కూడా వర్క్ షాప్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమా 2022 ఏప్రిల్ 28న లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ తేదీకి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ బాహుబలి 2, అలాగే మహేష్ బాబు టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ పోకిరి సినిమా అదే తేదీన థియేటర్స్ లోకి వచ్చాయి. ఆ సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అదేరోజు మొదలు పెట్టాలని భావిస్తున్నారట. ఇక ఆ లోపు మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక రాజమౌళి సినిమా కోసం ఏడాదిన్నార పాటు సమయాన్ని కేటాయించి సినిమాను 2023లో ప్రేక్షకుల ముందుకి ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X