SSMB29: రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. అసలు వర్క్ మాత్రం ఇంకా ఆలస్యంగా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు ఇటీవల ఒక యాక్షన్ ఎపిసోడ్ తో మొదలైంది. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను ఇదే ఏడాది పూర్తి చేయాలని చేసి వీలైనంత తొందరగా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు అయితే దసరా కు విడుదల చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు.
ఇక అప్పుడు మిస్ అయితే మళ్లీ 2024 సంక్రాంతికి విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు ఇదే ఏడాది మరొక సినిమాను కూడా పట్టాలెక్కించబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో 29వ సినిమా చేసేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో ప్రస్తుతం దర్శక ధీరుడు చాలా బిజీగా ఉన్నాడు.

వీరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రానుంది అని హాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలి అని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే మహేష్ బాబు పూర్తి ఫోకస్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పైన పెట్టాడు. అయితే రీసెంట్ గా రాజమౌళి మరోసారి మహేష్ బాబుతో చర్చలు జరుపినట్లుగా తెలుస్తోంది.
జూన్లో లేదా జూలైలో ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా లాంచ్ చేయాలని అనుకుంటున్నారట. పూజా ఫార్మాలిటీస్ ను అప్పుడు పూర్తి చేసి రెగ్యులర్ షూటింగ్ మాత్రం అక్టోబర్ తర్వాత స్టార్ట్ చేయవచ్చు అని తెలుస్తోంది. ముందుగానే రాజమౌళి పక్క ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్ ను ఒక ఏడాదిలోనే పూర్తిచేయాలని అనుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళి కోసం పూర్తిస్థాయిలో ఫోకస్ చేయడానికి రెడీగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా మార్పులు అవసరమైతే చేయాలని మహేష్ బాబు ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరి కలయికలో రాబోయే ప్రాజెక్ట్ మాత్రం 2025లో రిలీజ్ కావచ్చు అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











