మహేశ్ బాబు రాజమౌళి SSMB 29 టైటిల్ ఎంటో తెలుసా? జక్కన్న మైండ్ కి సలామ్ అనాల్సిందే
టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం SSMB 29. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 9న ఈ చిత్రం నుంచి జక్కన్న ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ క్రమంలో SSMB 29 చిత్రానికి అసలు టైటిట్ ఏమని ఫిక్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఓ టైటిట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే..
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్రాజెక్ట్స్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి అనౌన్స్ చేసిన చిత్రం SSMB 29. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం రూపుదిద్దుకుంటుందనేది మాత్రమే ప్రకటించారు. 2025 జనవరి 2న ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను ఇచ్చారు. కానీ ఎలాంటి వివరాలను మాత్రం ప్రకటించలేదు. ఇక షూటింగ్ పూజా కార్యక్రమాన్ని కూడా బయటికి తెలియకుండానే ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ చిత్రం 3 షెడ్యూళ్లను పూర్తి చేసుకుందని, తదుపరి షెడ్యూల్ కూడా ప్రారంభం అయిందని తెలుస్తోంది.

SSMB 29 టైటిల్ ఏంటీ?
తొలిసారిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న పాన్ వరల్డ్ ఫిల్మ్ SSMB 29. ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినిమాలకు తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి ఇండియన్ ఆడియెన్స్ తో పాటు ఇంగ్లీష్ ఆడియెన్స్ ను కూడా టార్గెట్ చేశారు. అందుకు తగట్టుగానే సినిమాకు హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లను హైర్ చేసుకొని వర్క్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా అటెన్షన్ ను పొందేందుకు ఈ సినిమాకు రోటీన్ కు భిన్నంగా టైటిల్ ను పెట్టారంట మన జక్కన్న.
ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. సినిమా కథను Gen 63 అనే టైటిట్ తో రిజిస్టర్ చేయించారని అంటున్నారు. ఇటీవలే ఈ టైటిల్ మారిందని సమాచారం. అయితే సినిమా కథ ప్రకారమే జక్కన్న Gen 63 అనే టైటిల్ ను ఖాయం చేశారని ప్రచారం. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ లో మహేశ్ బాబు పాత్ర తమ వంశంలో 63 జనరేషన్ కు చెందినదంట. ఈ క్రమంలోనే తమకు గతంలో కలిగి ఉన్న శక్తులను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడంట. హిందూ పురాణాలు, స్సైన్స్ ఫిక్షన్ మిళితంగా రాబోతున్న చిత్రం కావడంతో సినిమా GEN63 అనే టైటిట్ అనుకున్నారని ప్రచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
శరవేగంగా షూటింగ్..
జక్కన్న SSMB 29 చిత్రం విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలకంటే వేగంగా షూటింగ్ ను జరిపిస్తున్నారు. ఇదే సమయంలో ఏ చిన్న లీక్ జరగకుండా ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, కర్ణాటక, ఒడిషా, ఇటలీ, సౌత్ ఆఫ్రికాలో ముఖ్యమైన సీన్స్ ను షూట్ చేశారు. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











