SSMB29: మహేష్ బాబు సినిమా విషయంలో మరో ట్విస్ట్.. రాజమౌళి కథ ఎంతవరకు వచ్చిందంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయనున్నట్లు చాలా నెలల క్రితమే క్లారిటీ ఇచ్చారు. సూపర్ స్టార్ అభిమానులు ఈ చిత్రం ఎనౌన్స్ మెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి రాజమౌళి టీమ్ నుంచి మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకి రావడం లేదు. ఇక లేటెస్ట్ గా మరొ గాసిప్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయాలని ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. ఇక మొత్తానికి వీరి కలయిక పట్టాలు ఎక్కడానికి సమయం దగ్గర పడుతుంది అసలైతే ఇదే ఏడాదిలో సినిమా షూటింగ్ కూడా మొదలు కావాలి. కానీ అనుకొని కారణాల వలన ఆలస్యం అవుతోంది. అంతేకాకుండా రాజమౌళి స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైన తర్వాత గాని షూటింగ్ మొదలు పెట్టాలని అనుకోవడం లేదు.

అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్: వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ కథతో ఈ మూవీ తెరకెక్కనుంది అని ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చిత్ర కథ మొత్తం నడుస్తుందని చెప్పారు. ఇక రాజమౌళి కోసం కేవలం స్టొరీ మాత్రమే విని మహేష్ బాబు ఒకే చెప్పేశారు. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజున ఈ మూవీ ఓపెనింగ్ జరుగుతుందనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు.

బౌండెడ్ స్క్రిప్ట్ అయిన తర్వాత: అయితే ఈ సినిమా ఫైనల్ డ్రాప్ట్ ఇంకా కంప్లీట్ కాలేదని రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఫైనల్ అవుట్ అవుట్ సిద్ధం కావాల్సి ఉందని అన్నారు. ఇక రాజమౌళి కూడా బౌండెడ్ స్క్రిప్ట్ అయిన తర్వాత మూవీ వర్క్ షాప్, స్టొరీ బోర్డు సిద్ధం చేసుకుంటారు. దానికోసం నాలుగు, ఐదు నెలల టైమ్ తీసుకుంటారు. ఆ తర్వాత షూటింగ్ కి వెళ్తారు.

ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చట: ఈ లెక్కన మహేష్ బాబు బర్త్ డే నాటికి రాజమౌళి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఒక వేళ ఉన్న కూడా ఏదో ఫార్మాలిటీగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. షూటింగ్ మాత్రం ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా కోసం ఓ రెండేళ్ళు డేట్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినివాస్ సినిమా కూడా అందుకే గ్యాప్ తీసుకొని చేస్తున్నారని టాక్. గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది. 2025లో జక్కన్న సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











