SSMB29 : 3000 మందితో భారీ సీన్.. మహేశ్ బాబుతో జక్కన్న ఏం ప్లాన్ చేశాడో తెలుసా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఆ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో అసలైన సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూడగా.. ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చిత్రాలకు వరల్డ్ మార్కెట్ ఏర్పడింది. మరోవైపు మహేశ్ బాబుకూ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్ లుక్ ఉన్న ఏకైక హీరో తెలుగు హీరో మహేశ్ బాబు కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను మాత్రం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మాములుగానే జక్కన్న తన సినిమాలకు చాలా సమయం తీసుకుంటూ ఉంటారు. కానీ ఎస్ఎస్ఎంబీ29 చిత్రం ప్రారంభించడానికే చాలా సమయం తీసుకున్నారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 3 షెడ్యూళ్లు పూర్తయ్యాయి. నెక్ట్స్ నాల్గో షెడ్యూల్ కు యూనిట్ మొత్తం సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తదుపరి షెడ్యూల్ లో చిత్రీకరించబోయే సీన్లపై తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

Mahesh Babu SS Rajamouli SSMB29 shooting with 3000 Junior Artists

ఎస్ఎస్ఎంబీ29 చిత్రం 4వ షెడ్యూల్ ను ఎస్ఎస్ రాజమౌళి ఇటలీలో నిర్వహించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు కూడా నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఫ్లైట్ ఎక్కారు. బాబు లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మహేశ్ బాబు రగ్డ్ లుక్ కు, స్టైలిష్ వాక్ కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దేవుడి దర్శనం కలిగిందని సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే.. SSMB29 4వ షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ గురించి క్రేజీ అప్డేట్ అందింది.

ఎస్ఎస్ రాజమౌళి 3000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లను హైర్ చేసుకున్నారని తెలుస్తోంది. వీరందరితో నెక్ట్స్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. అది కూడా సముద్రంలో బోట్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ రిహార్సల్ ను ప్రాంభించే పనిలో ఉన్నారంట. ఏప్రిల్ చివరి వారంలో రిహార్సల్ చేసి షూట్ కు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. మహేశ్ బాబు గత చిత్రం 1 నేనొక్కడినే లో బోట్ ఫైట్ తో అదరగొట్టారు. ఇక మరోసారి భారీ స్థాయిలో బోట్ సీక్వెన్స్ తో అలరించబోతున్నారు.

ఇక SSMB29 చిత్రం మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 2న హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆ తర్వత 2వ షెడ్యూల్ ను ఒడిశాలో నిర్వహించారు. 3వ షెడ్యూల్ ను ఒడిశా రాష్ట్రంలోని కొరపుత్ మున్సిపాలిటీలో నిర్వహించారు. అక్కడ కాశీని పోలిన సెట్స్ ఏర్పాటు చేయిచించి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ షెడ్యూ ల్ లో పాల్గొన్నారు. మరోవైపు కెన్యాలోనూ షూటింగ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ తో శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జక్కన్న హై సెక్యూరిటీ మధ్య ఎలాంటి లీక్ లు జరగకుండా సినిమాను షూట్ చేస్తున్నారు. మే1న ఈ మూవీకి సంబంధించిన వీడియోతో పాటు అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

More from Filmibeat

Read more about: mahesh babu ss rajamouli ssmb29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X