SSMB 28: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టైటిల్ వచ్చేది ఎప్పుడంటే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 3వ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్టైల్ లోని ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథని చెప్పబోతున్నాడని తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్ లో మూవీ చేయబోతున్నాడు. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మూవీ చూడాలంటే కచ్చితంగా రెండేళ్ల సమయం అయిన పడుతుంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ త్వరలో రాబోయే సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Mahesh babu SSMB 28 Movie title announcement on ugadi

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ని మార్చిలో ఉగాది సందర్భంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ని మాటల మాంత్రికుడు తన స్టైల్ లో ఇప్పటికే ఫైనల్ చేసినట్లుగా సమాచారం. మరి ఈ టైటిల్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి సినిమాపై ప్రేక్షకులలో ఒక అంచనా కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ మేరకు టైటిల్ తో త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ nu ఇంప్రెస్ చేస్తాడో వేచి చూడాలి.

త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఇదివరకు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రెండు ప్రయోగాత్మకంగానే చేయడం విశేషం. ఇప్పుడు మరోసారి మహేష్ బాబుతో అలాంటి కొత్త ప్రయోగం త్రివిక్రమ్ చేస్తున్నాడని టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ స్టోరీస్ సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దీంతో కచ్చితంగా త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ కూడా మహేష్ బాబుని ఇంప్రెస్ చేసిందంటే గ్యారెంటీగా హిట్ అవుతుందని కొంతమంది భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X