SSMB28: అదే సెంటిమెంట్ తో త్రివిక్రమ్ పవర్ఫుల్ టైటిల్.. మహేష్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ రెడీ!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ కోసం ఘట్టమనేని అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాది మొదలవ్వాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వలన వాయిదా పడుతూ మొత్తానికి మరి కొన్ని వారాల్లో షూటింగ్ ను స్టార్ట్ చేసుకోబోతోంది. అయితే SSMB28 ప్రాజెక్ట్ కు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఆ టైటిల్ పై ఆఫీషియల్ గా క్లారిటీ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అలా సెట్టయిన ప్రాజెక్ట్

అలా సెట్టయిన ప్రాజెక్ట్

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో సినిమా తో భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ RRR సక్సెస్ అవుతుంది అని ఆ తరువాత కూడా పాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంటుంది అనే ఆలోచనతో త్రివిక్రమ్ ప్రాజెక్టు ను పక్కన పెట్టేశాడు. దీంతో త్రివిక్రమ్ మహేష్ బాబు తో కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయాల్సి వచ్చింది.

మంచి క్రేజ్

మంచి క్రేజ్

అతడు, ఖలేజా సినిమాలతో ఇదివరకే మహేష్ బాబుతో త్రివిక్రమ్ కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ మహేష్ బాబులోని కొత్త నటుడిని బయట పెట్టాయి. అభిమానులు ఇప్పటికీ కూడా ఆ సినిమాను టీవీ లో వస్తే చూస్తూనే ఉంటారు. ఆ విధంగా ఈ కలయిక కు ఒక మంచి క్రేజ్ అయితే ఉంది.

రూమర్స్ కు క్లారిటీ

రూమర్స్ కు క్లారిటీ

మహేష్ బాబు 28వ ప్రాజెక్టు కోసం త్రివిక్రమ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త యాక్షన్ కథను డెవలప్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా హైలెట్ కాబోతున్నట్లు సమాచారం. మొదట ఈ ప్రాజెక్ట్ అతడు సినిమాకు సీక్వెల్ అని టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక SSMB 28 సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జూన్ లేదా జులై మొదటి వారంలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

సెంటిమెంట్ తో పాత టైటిల్

సెంటిమెంట్ తో పాత టైటిల్

అయితే SSMB 28 సినిమాకు టైటిల్ విషయంలో కూడా త్రివిక్రమ్ ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు అర్జునుడు అనే ఒక టైటిల్ ఖరారు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. గతంలోనే మహేష్ గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన ఒక సినిమాకు అర్జున్ అనే టైటిల్ సెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కథకు సెట్టయ్యే విధంగా త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్ తోనే అర్జునుడు అనే టైటిల్ పెట్టడం జరిగింది.

డేట్ ఫిక్స్..?

డేట్ ఫిక్స్..?

ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ విషయంలో పెద్దగా ఆలస్యం చేయకుండా కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మే 31వ తేదీన అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమన్ ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టైటిల్ పోస్టర్ ను విడుదల చేయాలి అని అనుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X