SSMB31 : మహేశ్ బాబుతో సంప్రదింపులు.. రంగంలోకి సెన్సేషనేషనల్ డైరెక్టర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. SSMB 29 వర్క్ టైటిల్ తో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేశ్ బాబు చేయబోయే తదుపరి చిత్రాలపైనా కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతున్నాయి. కాగా SSMB 30, SSMB 31 చిత్రాలను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
మహేశ్ బాబు ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు. గుంటూరు కారం చిత్రం వరకు రీజినల్ చిత్రాలతో అలరించిన మహేశ్ బాబు ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. 2025 ఫిబ్రవరి నుంచి SSMB 29 చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. పాన్ వరల్డ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్ని ఉన్నాయి. ఇదే సమయంలో మహేశ్ బాబు రాబోయే చిత్రాలకు దర్శకత్వం వహిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ క్రమంలో రాబోయే చిత్రాలపై ఊహాగానాలు ఇలా ఉన్నాయి.

SSMB30 మూవీ..
మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న SSMB 29 చిత్రం తర్వాత మహేశ్ బాబు కోసం టాప్ డైరెక్టర్లు వెయిటింగ్ లో ఉన్నారు. కేవలం SSMB 30 కోసం ముగ్గురు దర్శకులు పోటీ పడుతున్నారు. వీరిలో టాప్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. ఇప్పటికే మహేశ్ బాబుతో సినిమా చేయాలని కథ కూడా చెప్పారంట. ఆ కథకు డెవిల్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశానని పలు మార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక మహేశ్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యమని అన్నారు.
మరోవైపు SSMB 30 ప్రాజెక్ట్ కోసమే మరో ఇద్దరు దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి మహేశ్ బాబుతో సినిమా చేయాలని భావిస్తున్నారంట. ఇప్పటికే వీరి కాంబోలో వన్: నేనొక్కడినే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నెక్ట్స్ మహేశ్ బాబుతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. ఇక ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు కూడా మహేశ్ బాబు డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. వీరి ముగ్గురిలో మహేశ్ బాబు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక SSMB 31 ప్రాజెక్ట్ పై తాజాగా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాలని ప్రయత్నిస్తోందంట. ఇక ముందుగా మహేశ్ బాబుతో ఎలాగైనా డేట్స్ తీసుకోవాలని, చెక్ లు పట్టుకొని తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై మున్ముందు మరింత అప్డేట్ రానుంది.


Click it and Unblock the Notifications











