గుంటూరు కారం సెన్సార్ రివ్యూ: మహేశ్ బాబు ఫ్యాన్సే షాకయ్యేలా.. రన్‌ టైం డీటేల్స్ లీక్

టాలీవుడ్‌లో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ స్టార్‌డమ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులు పట్టాలెక్కించే అతడు... గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు.

Recommended Video

Hanuman Vs Guntur Kaaram ప్రేక్షకులు ముందు పరిగెత్తేది Mahesh Babu సినిమాకే | FilmiBeat Telugu

దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'గుంటూరు కారం' అనే సినిమాను చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా సెన్సార్ రివ్యూ తాజాగా బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

 Mahesh Babu Starrer Guntur karam Movie Censor Certificate and Run Time Details

గుంటూరు కారం అంటూ: సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమానే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 Mahesh Babu Starrer Guntur karam Movie Censor Certificate and Run Time Details

షూట్ కంప్లీట్.. స్పీడ్‌గానే: చాలా గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో ఇటీవలే దీన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం చేసేశారు. ఆ తర్వాత పనులను కూడా శరవేగంగా జరుపుతున్నారు.

 Mahesh Babu Starrer Guntur karam Movie Censor Certificate and Run Time Details

రిలీజ్ ఏర్పాట్లను చేస్తూ: సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను వదలబోతున్నారు. అలాగే, కొన్ని ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. వీటితో పాటు చిత్ర యూనిట్‌తో కొన్ని ఇంటర్వ్యూలను కూడా నిర్వహించబోతున్నారు. దీంతో ఈ మూవీ సందడి బాగా కనిపించబోతుంది.

మహేశ్ మూవీ సర్టిఫికెట్: అదిరిపోయే స్టోరీతో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

 Mahesh Babu Starrer Guntur karam Movie Censor Certificate and Run Time Details

గుంటూరు కారం నిడివి: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన రన్ టైం వివరాలు కూడా తాజాగా బయటకు వచ్చింది. ఈ సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ మూవీ ఏకంగా 2 గంటల 40 సెకెన్ల పాటు ఉండబోతుందని తెలిసింది. అలాగే, యాడ్స్‌తో కలుపుకుని ఇది 2 గంటల 45 నిమిషాలు (165 నిమిషాలు) పాటు ఉంటుందని సమాచారం.

 Mahesh Babu Starrer Guntur karam Movie Censor Certificate and Run Time Details

సెన్సార్ రివ్యూ ఏంటంటే: ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. 'గుంటూరు కారం' మూవీని చూసిన సెన్సార్ సభ్యులు ఈ కంటెంట్‌కు ఫిదా అయ్యారని తెలిసింది. ముఖ్యంగా ఇందులో మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు పెట్టారని సమాచారం. ముఖ్యంగా సెకెండాఫ్‌లో వచ్చే మాస్ సీన్స్‌ను చూసి మహేశ్ బాబు ఫ్యాన్సే షాకయ్యేలా రూపొందించారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X