Guntur karam మూవీ ఇన్‌సైడ్ రిపోర్ట్ లీక్: మహేశ్ కెరీర్‌లో తొలిసారి.. ఆ రిమిక్స్ మాత్రం హైలైట్ అంతే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. అందుకే వాళ్లను కాలర్ ఎగరేసుకుని తిరిగేలా క్రేజీ సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఆ మధ్య హ్యాట్రిక్ హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. కానీ, గత చిత్ర ఫలితంతో నిరాశగా ఉన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో 'గుంటూరు కారం' అనే మూవీని చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఇన్‌సైడ్ రిపోర్టు లీకైంది. మరి అందులో హైలైట్ అంశాలు ఏంటి అనే వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
గుంటూరు కారంతో మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలను చేస్తున్నారు.

బ్రేకులు.. యమా స్పీడుగా
దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఏర్పడడంతో పాటు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్ సజావుగా సాగలేదు. కానీ, ఇప్పుడు మాత్రం చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.
రిలీజ్‌కు రెడీ.. ప్రచారంతో
హిట్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల చివరికి షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే, జనవరి 6వ తేదీన ఓ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేసి.. అప్పటి నుంచి ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారని తెలుస్తోంది.
మూవీ బ్యాగ్‌డ్రాప్ అదేనా
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తోన్న సినిమానే 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంతో పొలిటికల్ స్టోరీతో రాబోతుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఫ్యాన్స్‌ను అలరించే ఎన్నో అంశాలను పెడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇన్‌సైడ్ రిపోర్ట్.. మదర్‌దే
మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల అంశాలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఇన్‌సైడ్ రిపోర్ట్ లీకైంది. దీని ప్రకారం.. ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ హైలైట్‌గా ఉండబోతుందట. ఇందులో మహేశ్ తన కెరీర్‌లోనే తొలిసారి ఎక్కువ ఎమోషనల్ సీన్స్ చేస్తున్నాడని టాక్.

ఫైట్స్‌తో పాటు రిమిక్స్‌తో
ఎన్నో అంచనాలతో రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీ నుంచి తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ఇందులో మాస్ ఫైట్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే విధంగా డిజైన్ చేశారట. మరీ ముఖ్యంగా ఈ చిత్రం ఓ రిమిక్స్ సాంగ్ కూడా పెట్టినట్లు తాజాగా తెలిసింది. అయితే, అది ఎవరి పాట? ఎందుకు పెట్టారు? ఎలా రిమిక్స్ చేశారు? అనే విషయాలు సస్పెన్స్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











