Guntur karam: లీకైన గుంటూరు కారం సెకెండాఫ్.. ఆ 45 నిమిషాలు వేరే లెవెల్.. అది వర్కౌట్ అయితే హిట్టే
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎన్నో రకాల సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ, అందులో అతి తక్కువ మూవీలు మాత్రమే ఆరంభంలోనే భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుని ఓ రేంజ్‌లో సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న 'గుంటూరు కారం' మూవీ ఒకటి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని సెకెండాఫ్ మొత్తం లీక్ అయింది. ఆ సంగతులేంటో మీరు కూడా చూసేయండి మరి!
Recommended Video

మహేశ్ గుంటూరు కారంతో:సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రమే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు.

గుంటూరు కారం హడావిడి:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను వదలబోతున్నారు. అలాగే, కొన్ని ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. వీటితో పాటు చిత్ర యూనిట్‌తో కొన్ని ఇంటర్వ్యూలను కూడా నిర్వహించబోతున్నారు. దీంతో కొద్ది రోజులుగా ఈ మూవీ హడావిడే కనిపిస్తోంది.
మిర్చి యార్డ్ బ్యాగ్‌డ్రాప్‌తో:మహేశ్ బాబు తాజాగా నటిస్తోన్న సినిమానే 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంతో పొలిటికల్ స్టోరీతో రాబోతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఫ్యాన్స్‌ను అలరించే ఎన్నో అంశాలను పెడుతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

సెకెండాఫ్ మాత్రం రచ్చ:మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి తాజాగా ఓ కీలకమైన అంశం బయటకు వచ్చింది. ఇందులో సెకెండాఫ్ మొత్తం హై రేంజ్‌లో ఉంటుందట. ముఖ్యంగా ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు, మదర్ సెంటిమెంట్ సీన్స్ పీక్స్‌లో ఉంటాయని తెలిసింది. ఇవన్నీ గతంలో మహేశ్ సినిమాల్లో చూడని విధంగా తీసినట్లు టాక్.
45 నిమిషాలు వేరే లెవెల్:'గుంటూరు కారం' మూవీనిలోని సెకెండాఫ్‌లో వచ్చే చివరి 45 నిమిషాలు మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయని తెలుస్తోంది. క్లైమాక్స్ యాక్షన్, డ్రామా హై ఓల్టేజ్‌లో ఉండబోతుందని సమాచారం. వీటికితోడు ఎప్పటిలాగే త్రివిక్రమ్ డైలాగులు ఎంతో బలంగా ఉండబోతున్నట్లు తెలిసింది. మొత్తంగా 'గుంటూరు కారం' సెకెండాఫ్ ఫ్యాన్స్‌ను అలరించే అంశాలతో నింపారని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











