Guntur karam: మహేశ్ ఫ్యాన్స్‌కు మాసివ్ సర్‌ప్రైజ్.. గుంటూరు కారం ట్రైలర్ డేట్ ఫిక్స్

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరూ భారీ చిత్రాలను చేస్తూ పాన్ ఇండియా స్థాయికి ఎదగాలని భావిస్తున్నారు. కానీ, ఒకరిద్దరు మాత్రమే తెలుగు భాషకే పరిమితం అవుతున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ప్రాంతీయ చిత్రాలతోనే ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఇప్పుడు భారీ సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'గుంటూరు కారం' మూవీ చేస్తున్నాడు.

'అతడు', 'ఖలేజా' వంటి రెండు క్రేజీ మూవీల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న సినిమానే 'గుంటూరు కారం'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఫలితంగా దీనిపై మరింత హైప్ పెరుగుతూనే ఉంది.

 Mahesh Babu Starrer Guntur karam Movie Trailer Release on January 1st

సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురు కావడంతో షూట్‌ సక్రమంగా నడవలేదు. అయితే, ఇప్పుడు మాత్రం దీన్ని సంక్రాంతికి విడుదల చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'గుంటూరు కారం' సినిమా విడుదలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇక, ఇటీవలే వదిలిన రెండో పాటపై మాత్రం మిశ్రమ స్పందనే వచ్చింది.

ఫ్యాన్స్ అంచనాలను నిలబెట్టే విధంగా 'గుంటూరు కారం' ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, దీన్ని న్యూ ఇయర్ గిఫ్ట్‌గా జనవరి 1వ తేదీన విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే మహేశ్ ఫ్యాన్స్‌కు మాసివ్ సర్‌ప్రైజ్ అవుతుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X