మహేష్ బాబు నూతన గృహ ప్రవేశం 16న
మహేష్ బాబు కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి ఈ నెల 16న గృహ ప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహేష్ కి అత్యంత సన్నిహితులైన 30 కుటుంబాలు హాజరు కానున్నాయి.ఫిల్మ్ నగర్ లోని ఈ ఇంటిని తన అభిరుచికి అనుగుణంగా దగ్గరుండి కట్టించుకున్నారు. ఈ ఇంటి బయిట ఘట్టమనేనీస్ అనే నేమ్ బోర్డ్ ఉంది. అలాగే ఈ ఇంట్లో జమ్, స్విమ్మింగ్ పూల్ లేటెస్ట్ టెక్నాలిజీ ఉపయోగించి నిర్మించారని సమాచారం. ఇప్పటికే సినిమా పరిశ్రమలోని పెద్దలందరికీ ఈ గృహ ప్రవేశ నిమిత్తమై ఆహ్వానాలు వెళ్ళాయి. ఇక మహేష్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో సాగనుంది. వెంకటేష్ తో నమో వెంకటేశ చిత్రం నిర్మించిన ఎ టీవీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











