మహేష్-సుకుమార్ మూవీ తాత్కాలికంగా ఆగిపోయిందా.. షాకింగ్ రిపోర్ట్స్!
దర్శకుడు సుకుమార్ 'రంగస్థలం' సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం తన ఖాతాలో వేసుకుని సత్తా నిరూపించారు. ఈ విజయం తర్వాత సుకుమార్ మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేసే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసింది.
'రంగస్థలం' తర్వాత సూపర్ స్టార్‌తో చేయబోయే సినిమా స్కిప్టుపై బిజీ అయిపోయారు ఈ లెక్కల మాస్టారు. మహేష్ బాబు ప్రస్తుతం తాను చేస్తున్న 'మహర్షి' సినిమా చివరి దశకు చేరుకోవడంతో సుకుమార్‌కు ఫోన్ చేసి ఫైనల్ స్క్రిప్టు వినిపించాలని కోరారట.

ఇంకా స్క్రిప్టు సిద్ధం చేయని సుకుమార్?
ఇటీవల మహేష్ బాబును కలిసిన సుకుమార్ ఇంకా స్క్రిప్టు సిద్ధం కాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి స్క్రిప్టు రెడీ కావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని వెల్లడించారట. ఈ విషయం ఇపుడు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది.

సుకుమార్ ఇంటెన్షన్ అదే...
సుకుమార్ ప్రస్తుతం కొత్త రైటర్స్ టీమ్‍తో పని చేస్తున్నారని, మహేష్ బాబు సినిమాకు సంబంధించిన స్క్రిప్టు లేటవ్వడానికి అది కూడా ఓ కారణమనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరో వైపు సుక్కు తన సొంత ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టడం కూడా ఆలస్యానికి ఓ కారణంగా చెప్పుకుంటున్నారు.

లేటైనా.. హిట్టు కొట్టే స్క్రిప్టుతో
మహేష్ బాబుతో సుకుమార్ చేసిన గత చిత్రం ‘1-నేనొక్కడినే' బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. అయితే ఈ సారి ఎలాంటి మిస్టేక్ జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కాస్త లేటైనా హిట్ట కొట్టే స్కిప్టుతోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట.

మహర్షి
ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి' చిత్రంలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











