మహేష్, సుకుమార్ కాంబినేషన్ టైటిల్ అదే?
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి చంద్రుడు అని టైటిల్ పెట్టినట్లుగా వినిపిస్తోంది. ఏప్రియల్ 23 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా ఖరారైంది. దూకుడుని నిర్మించిన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే 2013 సంక్రాంతి పండుగకి విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే తొలి సారిగా దేవి శ్రీప్రసాద్ మహేష్ బాబు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం అభిమానులు కోరుకునే అన్నికమర్షియల్ అంశాలతో తెరకెక్కనుంది.
మహేష్ బాబు మరో వైపు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు సరసన సమంత నటిస్తోంది. వెంకటేస్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











