సర్కారు వారి పాట విషయంలో మహేష్ అప్సెట్.. మళ్ళీ పోకిరి తరహాలోనే సెంటిమెంట్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా టాప్ లిస్టులో ఉంది. గీతగోవిందం సినిమా తో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురామ్ ఎప్పటినుంచో మహేష్ బాబు తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మొత్తానికి ఆ సక్సెస్ అనంతరం సర్కారు వారి పాట సినిమా ద్వారా అతనికి లక్కీ ఛాన్స్ దొరికింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మహేష్ ఒక సన్నివేశం విషయంలో చాలా అప్సెట్ అయినట్లు టాక్ అయితే గట్టిగానే వస్తుంది. ఇక మళ్ళీ పోకిరి స్టైల్ లోనే ఒక సెంటిమెంట్ అయితే రిపీట్ అవుతున్నట్లు అర్థమవుతోంది.
Recommended Video

చాలా విభిన్నంగా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో చాలా విభిన్నంగా కనిపించటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో కూడా ఒక డిఫరెంట్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ టీజర్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

చొక్కాలు చింపుకునేలా..
సర్కారు వారి పాట సినిమాను దర్శకుడు పరుశురామ్ పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రేక్షకులకు మంచి సందేశం అందించబోతున్నట్లు ముందుగానే ఒక వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది అని ఫ్యాన్స్ థియేటర్స్ లో చొక్కాలు చింపుకోవడం జరుపుకోవడం ఖాయమని కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.

మళ్ళీ వర్క్ చేస్తున్న డైరెక్టర్
అయితే సినిమాకి సంబంధించిన మరొక అంశం ఇండస్ట్రీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొదట అనుకున్న క్లైమాక్స్ సన్నివేశాన్ని ప్రస్తుతం తెరకెక్కించడం లేదట. మహేష్ బాబు ఆ విషయంలో కొంత అనుమానాలు వ్యక్తం చేయడంతో దర్శకుడు స్క్రిప్ట్ పై మళ్లీ కూర్చున్నట్లుగా టాక్ అయితే వస్తుంది. మహేష్ బాబుకు ఇటీవల సర్జరీ అవడంతో దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. ఇక సినిమాను కూడా ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు. దీంతో త్వరలో షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదు కాబట్టి దర్శకుడు ఆ విషయంలో మళ్లీ తన రైటర్స్ తో కూర్చుని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మహేష్ ఒక్కసారి ఫిక్స్ అయితే..
సాధారణంగా మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా.. ఎవరితో సినిమా చేసినా కూడా ఒకసారి స్క్రిప్ట్ ఓకే చేస్తే దర్శకుడిని ఏమాత్రం ప్రశ్నించడు. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత దర్శకుడిదే తుది నిర్ణయమని అతను ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు అని చాలామంది దర్శకులు కూడా పలు ఇంటర్వ్యూలలో తెలియజేశాడు.

అప్పట్లో పోకిరి విషయంలో
అయితే మహేష్ బాబు అప్పుడప్పుడు కొన్ని సందేహాలను కూడా దర్శకుల్లో కలిగిస్తాడని మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. గతంలో పోకిరి సినిమా క్లైమాక్స్ విషయంలో కూడా పూరి జగన్నాథ్ తో చాలా రోజులు సిట్టింగ్ చేసినట్లు టాక్ వచ్చింది. దర్శకుడు పూరీజగన్నాథ్ మొదట అనుకున్న స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ షూటింగ్లో మార్చేశాడట. ఆ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలు మొత్తం చివరిదశలోనే చేంజ్ చేసినట్లుంది అప్పట్లో అయితే గట్టిగానే వచ్చింది. ఏదేమైనా సినిమా మాత్రం బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

మళ్ళీ అదే సెంటిమెంట్..
ఇక సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా పరశురామ్ అదే తరహాలో మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కూడా అతని పనితనాన్ని చాలా లైక్ చేస్తున్నాడట. కానీ క్లైమాక్స్ లో ఇంకాస్త బెటర్ గా ఉంటే బావుంటుందని అనుకున్నారట. ఫస్టాఫ్ మొత్తం సినిమా సరదాగా రొమాంటిక్ సన్నివేశాలతో చాలా కామెడీగా కొనసాగుతుందట. ఇక ఆ తర్వాత సెకండాఫ్ లో మంచి సందేశంతో పాటు ఊర మాస్ ఎలివేషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక పోకిరి తరహాలోనే రీ షూట్స్ చేస్తున్నారంటే బాక్సాఫీస్ సెంటిమెంట్ అంటూ ఓ వర్గం ఫ్యాన్స్ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











