మహేష్ విలన్ పాత్ర కోసం పోటీగా ముగ్గురు సీనియర్ హీరోలు.. కానీ అందరి చూపు అతనివైపే..

సినిమాలో హీరోల కన్నా కూడా ఈ మధ్య కాలంలో విలన్స్ కి క్రేజ్ ఎక్కువగా వస్తోంది. నెగిటివ్ పాత్రలు చేసిన వారికి కూడా జనాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అందుకే దర్శకులు విలన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పటి హీరోలు కూడా ఇప్పుడు విలన్స్ పాత్రలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడంతో సినిమాలపై అంచనాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇక నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలో కూడా ఒక సీనియర్ హీరో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఆ ఒక్క పాత్ర కోసం..

ఆ ఒక్క పాత్ర కోసం..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సర్కారు వారి పాట అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు ఏండింగ్ కి వచ్చేశాయి. దాదాపు అన్ని పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకున్న దర్శకుడు ఇంకా ప్రతి నాయకుడి విషయంలో మాత్రం ఫైనల్ డిసిషన్ కి రాలేదని తెలుస్తోంది.

ఉహాలకందని రేంజ్ లో ఉండాలని..

ఉహాలకందని రేంజ్ లో ఉండాలని..

సినిమాలో విలన్ పాత్ర చాలా బలంగా ఉండాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. అయితే ఈ సినిమాలో అభిమానుల ఉహాలకు అందని రేంజ్ లో విలన్ పాత్రను చూపించాలని దర్శకుడు సీనియర్ హీరోలను సంప్రదిస్తున్నాడు. ఇప్పటికే పరభాషా నటుల పేర్లు చాలానే వినిపించాయి. ఇక అందులో ఒక ముగ్గురిలో ఎవరో ఒకరు ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పోటీగా సీనియర్ హీరోలు

పోటీగా సీనియర్ హీరోలు

ఆ సీనియర్ యాక్టర్స్ మరేవరో కాదు. కన్నడ స్టార్స్ సుదీప్, ఉపేంద్రతో పాటు తమిళ నటుడు అరవింద్ స్వామిని కూడా విలన్ పాత్ర కోసం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇదివరకే వీరిలో ఉపేంద్ర తప్పితే ఆ ఇద్దరు నటులు కూడా పూర్తిగా విలన్ పాత్రలతో మెప్పించిన వారే. ఇంకా ఉపేంద్ర ఫుల్ విలన్ జనర్ ని టచ్ చేయలేదు.

Recommended Video

#SarkaruVaariPaata: Kichcha Sudeep To Play Key Role In Mahesh Babu's Movie | Filmibeat Telugu
 అందరి దృష్టి అతనివైపే..

అందరి దృష్టి అతనివైపే..

గత నెల నుంచి ఈ సినిమా విషయంలో విలన్ కి సంబంధించిన రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ లో అందరి దృష్టి మాత్రం కన్నడ స్టార్ ఉపేంద్ర పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన పూర్తిగా నెగిటివ్ పాత్రలో కనిపిస్తే అద్భుతంగా ఉంటుందని దర్శకుడికి సలహాలు అందుతున్నాయట. మరి డైరెక్టర్ పరశురామ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X