దూకుడు సినిమా ఆలస్యానికి కారణం నేను కాదంటున్న మహేష్
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ తెలుగు తెరపై తిరుగులేని హీరో అనడంలో ఎటువంటి సందేహాం లేదు. మూడు సంవత్సరాల తర్వాత ప్రిన్స్ మహేష్ తన అభిమానుల కోసం ఖలేజా ఇచ్చినా అది బాక్సాఫీసు వద్ద బోర్లా పడడంతో అర్జెంట్‌గా సంవత్సరానికి రెండు సినిమాలు తీసి అభిమానుల మనసులో చోటు సంపాదించాలని సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తానని వాగ్దానం చేశారు. దాంతో ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు అనే సినిమాలో నటించారు. ప్రిన్స్ మహేష్ చెప్పిన మాటల ప్రకారం ఈ సంవత్సరం మార్చిలో దూకుడు సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా జూన్ లో విడుదలవతుందని సమాచారం.
చాలా మంది దూకుడు సినిమా విడుదల ఆలస్యానికి కారణం ప్రిన్స్ మహేష్ అంటూ అంటున్నారు. కానీ దూకుడు సినిమా ఆలస్యానికి కారణం గతంలో టాలీవుడ్‌లో జరిగినటువంటి సమ్మెలే కారణం అని ప్రిన్స్ మహేష్ తన సన్నిహితులు దగ్గర చెప్పినట్లు సమాచారం. సమ్మె కారణంగా దాదాపు టాలీవుడ్ మొత్తం రెండు నెలలు షూటింగ్స్ ఆపడం జరిగింది. ఆ రెండు నెలలు అలా దూకుడు సినిమా వెనక్కు వెళ్శాల్సి వచ్చింది.
సమ్మెల కారణంగా దూకుడు సినిమాలో విలన్‌గా నటిస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ డేట్స్ కూడా ఎడ్జెస్ట్ అవ్వక పోవడంతో సినిమా డిలే అయిందని ప్రిన్స్ మహేష్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించాడని సమాచారం. ఏది ఏమైనా గానీ 2011వ సంవత్సరంలో ప్రిన్స్ మహేష్ రెండు సినిమాలు గ్యారంటీగా విడుదల అయ్యేటట్లు చూస్తున్నాడని వినికిడి. అవసరం ఐతే మూడు సినిమాలు విడుదలయిన ప్రిన్స్ మహేష్ అభిమానులు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











