twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోకిరి స్టైల్లో ‘దూకుడు’ చేయాలని మహేష్ టెన్షన్..

    By Sindhu
    |

    టాలీవుడ్ నెం 1 హీరో అంటూ మహేష్ ని మోసేసిన అభిమాన సంద్రం నివ్వెరపోయింది ఫ్యూచర్ మెగాస్టార్ అంటూ మహేష్ ని ఆకాశానికెత్తేసిన మీడియా సైలెంట్ అయిపోయింది. దానికి కారంణం 'ఖలేజా" సినిమా కోసం మూడేళ్ళ పాటు టైమ్ తీసుకున్నాడు మహేష్. ఓ హీరో కెరీర్ లో ఇదేమీ చిన్న పీరియడ్ కానే కాదు. కనీసం ఓ అరడజను సినిమాలు ఈ టైమ్ లో రిలీజ్ అయిపోయేవే సరిగ్గా సినిమాలు చేస్తే. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ అంగీకరించేశాడు. ఇకపై ఆ తప్పు చేయనన్న మహేష్,'దూకుడు" సినిమాతో చాలా దూకుడుతో ప్రేక్షకుల ముందుకొస్తానని హామీ ఇచ్చాడు.

    శ్రీనువైట్ల దర్శకుడు కావడంతో, మహేష్ మీద నమ్మకాల్లేకపోయినా ఈ సినిమా ఎలాగోలా తొందరగా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుందని మహేష్ అభిమానులు బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. అందుకే, చాలా తొందరగా 'ఖలేజా" ప్లాప్ ని దిగమింగేసుకున్నారు. అయితే మహేష్ మాత్రం 'దూకుడు" సినిమాని ఫలానా టైమ్ లో మీ ముందుకు తెస్తాననే భరోసా అభిమానులకు ఇవ్వలేకపోతున్నాడు. శ్రీను వైట్ల సినిమాకు బిన్నంగా 'దూకుడు" చాలా స్లోగా తెరకెక్కుతోందిట. మళ్ళీ 'ఖలేజా" టైమ్ కి తప్ప ఈలోగా సినిమా విడుదలయ్యే అవకాశాలు కన్సించడంలేదు. ఈ నేపథ్యంలోనే మహేష్ ఏమో 'పోకిరి" స్టైల్ లో ఫినిష్ చెయ్యాలనీ, బాక్సాఫీస్ లో భారీ లాభాల్ని చూపించాలనీ కలలు కన్న మహేష్ తాను టెన్షన్ పడిపోతూ, శ్రీను వైట్లను టెన్షన్ పెట్టేస్తున్నట్టు సమాచారం. సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే..

    English summary
    Mahesh Babu’s latest movie Dookudu has finished schedule in Guajrat. Dookudu has completed shooting in Malaysia and Turkey in the previous schedules. A scene and a song were shot on Mahesh Babu, Samantha near Kutch,Gujarat. Dookudu’s team came back to Hyderabad and new schedule is going to begin from February 15 and will go on till March 3
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X