తెలుగులో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరో
హైదరాబాద్: ఏ హీరో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు అనేది ఎప్పుడు సినీ అభిమానుల్లో హాట్ టాపిక్కే. అయితే ఈ రెమ్యునేషన్ ఎంత అనేది అఫీషియల్ గా బయిటకు రాకపోయినా,అనధికారిక వార్తలా ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూంటుంది. ఆయా హీరోలతో పనిచేసే టెక్నిషియన్స్ ద్వారా బయిటకు ఫిగర్స్ వస్తూంటాయి. అలా వినపడిన దాన్ని బట్టి ప్రస్తుతం మహేష్ బాబు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రెమ్యునేషన్ ని కూడా ఆయన దాటారని తెలుస్తోంది.
అందిన సమాచారాన్ని బట్టి ఆయన ఆగడు చిత్రానికి 18 కోట్లు వరకూ ఛార్జ్ చేసాడని తెలుస్తోంది. అలాగే కొరటాల శివతో ఆయన చేయబోయే చిత్రం నిమిత్రం ఇరవై కోట్లు రెమ్యునేషన్ గా తీసుకుంటున్నారని, అందుకే ఆయన టాలీవుడ్ లో హైయిస్ట్ పెయిడ్ హీరోగా చెప్తున్నారు. ఎందుకంత పే చేస్తున్నారు అంటే ఆయనతో సినిమా ఎనౌన్స్ చేయగానే క్రేజీగా బిజినెస్ అయిపోతుందని, ఆయన ఫ్లాఫ్ చిత్రాలు సైతం మంచి కలెక్షన్స్ రాబట్టాయని, శాటిలైట్ రైట్స్ సైతం బాగా పలుకుతాయని లెక్కలు చెప్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
ఇక 'పోకిరి' తర్వాత పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా మహేష్‌బాబు కనిపించబోతున్న చిత్రం 'ఆగడు'. తమన్నా హీరోయిన్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బళ్లారిలో జరుగుతోంది. 'దూకుడు'తో మహేష్‌బాబుని పరర్ ఫుల్ పోలీసుగా చూపించిన శ్రీనువైట్ల ఇప్పుడు మరోసారి మహేష్‌తో ఖాకీ కట్టించారు. వీరిద్దరి కలయికలో 'ఆగడు' రూపుదిద్దుకుంటోంది. దాంతో ఈ చిత్రంపై ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











