మహేష్ గెస్ట్ గా వస్తాడు సరే...విషయం ఉందా?
హైదరాబాద్ : మహేష్ ఎవరికి పడితే వారి సినిమాల పంక్షన్ కు పోరు. అరుదుగా మాత్రమే...మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ గా వస్తూంటాడు. దాంతో ఆయన వస్తున్నాడు అంటే సినిమా గురించి అందరికీ తెలుస్తుంది..తద్వారా బిజినెస్ బాగా జరుగుతుందని అందరూ భావిస్తారు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు చిత్రాలకు అలాగే మహేష్ ఆడియో పంక్షన్ లకు గెస్ట్ గా వస్తున్నారు. అయితే ఎంతవరకూ ప్లస్ అవుతుంది చూడాలి అంటున్నారు సినీ వర్గాలు. ఏదైమైనా సినిమాలో విషయం ఉంటే మహేష్ గెస్ట్ గా వస్తున్నాడు అనేది ఉపయోగపడుతుంది.
గతంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఆడు మగాడ్రా బుజ్జీ చిత్రం ఆడియో పంక్షన్ కు సైతం వచ్చారు. కానీ ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. కాకపోతే ఈ ఎట్రాక్షన్ కూడా లేకపోతే సుధీర్ బాబు సినిమా గురించి పట్టించుకునేవారు ఎవరనేది ప్రశ్న. ఇక అసలు విషయం లోకి వస్తే ..సుధీర్ బాబు తాజా చిత్రం మోసగాళ్లకు మోసగాడు కు మహేష్ గెస్ట్ గా వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.
ఇక ‘మోసగాళ్లు మోసగాడు' విషయానికి వస్తే...

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న ‘మోసగాళ్లకు మోసగాడు' చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. స్వామి రారాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ బాబు సరసన నందిని అనే కొత్తమ్మాయి హీరోయిన్. చక్రి చిగురుపాటి నిర్మాత. బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.
1971లో కృష్ణ కౌబోయ్ వేషంలో అదరగొట్టిన సినిమా `మోసగాళ్లకు మోసగాడు`. ఇప్పుడు ఈ టైటిల్‌ని సుధీర్ బాబు సినిమాకు పెట్టడంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. సినిమా పూర్తి వినోదాత్మకంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సుదీర్ బాబు చేస్తున్న సినిమాలకు బావ మహేష్ బాబు, మామ కృష్ణ సినిమాల్లోని డైలాగులు, టైటిళ్ల వాసన ఎక్కువయింది. మొన్నామధ్య మహేష్ బాబు సినిమాలోని పాపులర్ డైలాగ్ 'ఆడు మగాడ్రా బుజ్జీ'ని తన సినిమా టైటిల్ గా సుధీర్ బాబు వాడుకున్నాడు. ఇప్పుడు మావయ్య టైటిల్‌ని వాడుకొంటున్నాడు.


Click it and Unblock the Notifications











