Bhagavanth Kesari: బాలయ్య కోసం మహేశ్ బాబు.. ఇది కదా ఫ్యాన్స్‌కు అసలైన సర్‌ప్రైజ్

టాలీవుడ్‌లో ఇప్పుడున్న సీనియర్ స్టార్ హీరోల్లో వరుస హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' సినిమాలతో కెరీర్ బెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఆయన.. మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేస్తున్నారు.

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమానే 'భగవంత్ కేసరి'. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. అదే సమయంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా పూర్తి చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్‌ను కూడా అతి త్వరలోనే మొదలు పెట్టేలా ప్లాన్ చేశారు.

Balakrishna in Bhagavanth Kesari

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'భగవంత్ కేసరి' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లు, టీజర్, రెండు పాటలు మాత్రమే వచ్చాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరిన్ని అప్‌డేట్ల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ గురించి గురువారమే ప్రకటన వెలువడింది. దీన్ని అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అందులో వెల్లడించారు.

'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఎలా రిలీజ్ చేయబోతున్నారు అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదల చేస్తున్నారని తెలిసింది. దీంతో ఇద్దరు హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Mahesh Babu to Release Bhagavanth Kesari Trailer on October 8th

ఇక, 'భగవంత్ కేసరి' మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి ఏదైనా ఈవెంట్‌ను నిర్వహిస్తారా? లేక మామూలుగానే మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదల చేయిస్తారా? అన్నది మాత్రం తెలియలేదు. అయితేనేం ఈ సినిమా ట్రైలర్‌ను మరింత ఎక్కువ మందికి చేరువ అయ్యేలా ప్లాన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేస్తున్నారు. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X