ప్లాన్ ​మార్చిన మహేష్ బాబు.. మునుపెన్నడూ లేని విధంగా అలా !

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు ఏడాది గడుస్తోంది. ఆయన నుంచి మరో సినిమా రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతి దాకా ఎదురు చూడాల్సిందే అని అంటున్నారు.. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న మహేష్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా రిలాక్స్డ్ మోడ్‌లో సినిమాలు చేస్తారు. సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయాలనే తొందర లేకుండా ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా మొదలు పెడతారు.

అంతే కాకా సినిమా సినిమాకు మధ్య సెలవులు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆయన తన ప్రణాళికలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఒకేసారి ఒకే ప్రాజెక్టుపై ఎక్కువగా దృష్టి సారించే మహేష్ ఇప్పుడు రెండు సినిమాలకు ఒకే సారి చిత్రాలకు పని చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా తెరకెక్కుతోంది.

Mahesh Babu to work parallelly on parasuram and trivikram movies

ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో షూటింగ్ జరిపారు. రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో చేయాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముందు ఈ సినిమా పూర్తయ్యాక మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాలని అనుకున్నా ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్ లు ఒకే సారి చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాలు రిలీజ్ చేసి దాదాపు ఏడాదిన్నర పైగా అవుతున్న కారణంగా ఫ్యాన్స్ ని ఎక్కడ నిరాశ పరచకుండా రెండు సినిమాలు ఆరు నెలల గ్యాప్ తోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X