GunturKaaram: అడ్డంగా దొరికిపోయిన త్రివిక్రమ్... 30ఏళ్ల క్రితం స్టోరీతో గుంటూరు కారం!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. అయితే ఈ సినిమా ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. దీంతో గురూజీపై ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఈ గుంటూరు కారం సినిమా స్టోరీ 30 ఏళ్ల క్రితం స్టోరీ అని నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుంటూరు కారం ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఈ మూవీలో ఊర మాస్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఇక ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన రావడంతో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ట్రోలింగ్ మొదలు అయింది.

అయితే గుంటూరు కారం సినిమా 30 ఏళ్ల క్రితం స్టోరీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా మలయాళ చిత్రాన్ని గుర్తుకు చేస్తుందంటూ నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం మూవీని చూసినవాళ్లు ఈ మూవీ అజ్ఞాతవాసి, అల వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది వంటి సినిమాలను కలిపి కొట్టేసినట్టుగా ఉందంటూ ట్రోలింగ్ మొదలు పెట్టగా.. ఇప్పుడు మరో సినిమా తెరపైకి వచ్చింది.
గుంటూరు కారం మూవీ కథ విషయానికి వస్తే... హీరో తల్లికి ఇద్దరు భర్తలు ఉండగా.... అజ్ఞాతవాసి మూవీలో హీరో తండ్రికి ఇద్దరు భార్యలు ఉంటారు. అటు అత్తారింటికి దారేది సినిమాలో అత్త, అల్లుళ్ల మధ్య జరిగే క్లైమాక్స్... ఇక ఈ మూవీలో తల్లి, కొడుకుల మధ్య జరుగుతుంది. అలా వైకుంఠపురంలో సినిమాలో కూడా ఈ మూవీలోనూ హీరో తన కుటుంబానికి దూరంగా పెరుగుతాడు. ఇవన్నింటినీ కంపైర్ చేస్తూ.. నెటిజన్స్.. అన్ని కలగలపి చిత్రాన్ని రూపొందించారంటూ కామెంట్స్ చేశారు.

రాజమాణిక్యం సినిమాలోనూ హీరోను తల్లి వదిలేస్తుంది. కుటుంబానికి దూరంగా వెళ్లిపోయిన హీరో గ్యాంగ్ స్టర్ గా మారి.. తన కుటుంబంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి మళ్లీ వస్తాడు. అలాగే అతనికి ఒక కన్ను కనిపించదు. ఇక గుంటూరు కారం సినిమాలోనూ... ఇదే కథను దించాడు త్రివిక్రమ్. రాజకీయాల కారణాల వల్ల కొడుకును వదిలేసి తల్లి.. రెండో పెళ్లి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాలోనూ హీరో కన్ను దెబ్బతింటుంది.
ఇక కుటుంబ సమస్యలు తీర్చడానికి హీరో మళ్లీ తల్లి దగ్గరకు వస్తాడు. అలా ఈ మూవీని త్రివిక్రమ్ 30 ఏళ్ల క్రితం రాజమాణిక్యం స్టోరీతో తెరకెక్కించారంటూ... నెటిజన్స్ మండిపడుతున్నారు. అయితే ఈ విషయాలపై దర్శకుడు త్రివిక్రమ్.. సినిమా విడుదలకు ముందే క్లారిటీ ఇచ్చారు. ఇది ఏ సినిమాకు కాపీ కాదని... తను అనుకున్న కథను తెరకెక్కించినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











