Guntur Kaaram: మహేశ్ గుంటూరు కారానికి ఆ 2 సెంటిమెంట్స్... వర్కౌటయితే బొమ్మ బ్లాక్ బస్టరే!

ఈ సంక్రాంతి బరిలో వస్తున్న సినిమాల్లో ఒకటి గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు కూడా జరుపుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో ఈ సినిమాకు ఆ రెండు సెంటిమెంట్స్ వర్కౌట్ అయితే సూపర్ హిట్ అవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ సంక్రాంతి పండుగ‌కు గుంటూరు కారం మూవీతో రాబోతున్నారు. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించగా. తమ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌ారు. ఇక ఈ మూవీ జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం అట్ట‌హాసంగా విడుద‌ల అయ్యేందుకు రెడీ అవుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై ఎలాంటి అంచ‌నాలు నెల‌కొన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Mahesh Babu Trivikram Guntur Kaaram Movie Set To Repeat Sankranthi Magic

మ‌రో రెండు రోజుల్లో రిలీజ్ ఉండ‌టంతో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ లో హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంటును పూర్తి చేసుకుంది ఈ సినిమా. విడుదల అయిన ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అని మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరు కారం విష‌యంలో రెండు సెంటిమెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

అందులో ఒకటి సంక్రాంతి సెంటిమెంట్. సూపర్ స్టార్ మ‌హేష్ బాబుకు సంక్రాంతి సీజ‌న్ చాలా బాగా కలిసివచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హేష్ బాబు కెరీర్‌లో సంక్రాంతికి ఆరు సినిమాలు రాగా.. వాటిలో ట‌క్క‌రి దొంగ, వ‌న్‌-నేనొక్క‌డినే చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక మిగతా నాలుగు చూసుకుంటే.. ఒక్క‌డు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, స‌రిలేరు నీకెవ్వ‌రు, బిజినెస్‌ మెన్ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచాయి.

Mahesh Babu Trivikram Guntur Kaaram Movie Set To Repeat Sankranthi Magic

ఇప్పుడు గుంటూరు కారం మ‌హేష్ కెరీర్ లో ఏడో సినిమా సంక్రాంతి పండుగ‌కు రిలీజ్ కాబోతుంది. అలాగే మ‌రో సెంటి మెంట్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌కాష్ రాజ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ బాబు, ప్ర‌కాష్ రాజ్ కలిసి చాలా చిత్రాల్లో నటించారు. అయితే వాటిలో మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సూపర్ హిట్టుగా నిలిచాయి. ఈ జాబితాలో ఒక్క‌డు, ఆగ‌డు, అత‌డు, పోకిరి, దూకుడు, సీత‌మ్మ వాకిట్లో సీరిమ‌ల్లె చెట్టు, బిజినెస్‌ మెన్, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు త‌దిత‌ర చిత్రాలు ఉండగా.. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి.

ఒకానొక స‌మ‌యంలో ప్ర‌కాష్ రాజ్ ఉంటే మ‌హేష్ కు హిట్ ఖాయ‌మ‌నే సింటిమెంట్ కూడా ఇండ‌స్ట్రీలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు గుంటూరు కారంలోనూ ప్ర‌కాష్ రాజ్ కీలక పాత్ర‌లో నటిస్తున్నారు. దీంతో సంక్రాంతి, ప్ర‌కాష్ రాజ్ సెంటిమెంట్స్ రిపీట్ అయితే గుంటూరు కారం బ్లాక్ బ‌స్ట‌రే అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X