మహేష్ బాబు కోసం సీనియర్ హీరోయిన్ కూతురు.. 20 ఏళ్ళు గ్యాప్ ఉన్న అమ్మాయితో రొమాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి ఈ ఏడాదిని మిస్సవుతున్నాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్టు కొట్టిన సూపర్ స్టార్ మళ్ళీ 2022లోనే బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం ఒక సీనియర్ హీరోయిన్ కూతురిని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

కోవిడ్ ఎఫెక్ట్..

కోవిడ్ ఎఫెక్ట్..

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీతగోవిందం అనంతరం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ కు అప్పుడప్పుడు బ్రేకులు పడుతున్నాయి.

 మహేష్ తో ప్లాన్ చేసుకుంటే..

మహేష్ తో ప్లాన్ చేసుకుంటే..

మహేష్ బాబుతో కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే తక్కువ రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయవచ్చని పూరి జగన్నాథ్ ఎప్పుడో రుజువు చేశాడు. కమిట్మెంట్ ఇస్తే దర్శకుడి ఆలోచన విధానానికి 100% న్యాయం చేయగలడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అదే తరహాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

 వర్కింగ్ టైటిల్..

వర్కింగ్ టైటిల్..


మహేష్ బాబు 28వ సినిమాపై ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడు , ఖలేజా వంటి విభిన్నమైన సినిమాల అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు హై వోల్టేజ్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక సినిమాకు 'పార్ధు' అనే వర్కింగ్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

మహేష్ కోసం సీనియర్ హీరోయిన్ కూతురు

మహేష్ కోసం సీనియర్ హీరోయిన్ కూతురు


ఇక దర్శకుడు త్రివిక్రమ్ క్యాస్టింగ్ పనులను పూర్తి చేయకముందే అప్పుడే హీరోయిన్ విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఒక సీనియర్ హీరోయిన్ కూతురిని ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోంది. ఆమె మహేష్ బాబు కంటే దాదాపు 20ఏళ్ళు చిన్నది అని సమాచారం.

Recommended Video

SSMB 28 లో Mahesh Babu పాత్ర ఇదేనట | Mahesh Babu Trivikram Movie || Filmibeat Telugu
 జాన్వీ కపూర్ పై ఫోకస్?

జాన్వీ కపూర్ పై ఫోకస్?


ఆమె మరెవరో కాదు. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఆమె వయసు ప్రస్తుతం 24ఏళ్ళు. ఇక మహేష్ బాబు 45 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే ఉంటాడు. ఈ జోడి కథకు పర్ఫెక్ట్ గా సెట్టవుతుందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. మొదట పూజా హెగ్డేను అనుకున్నప్పటికి రోటీన్ అయిపోతుందని మనసు మార్చుకున్నారు. మరి జాన్వీ విషయంలో మహేష్ - త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X