250 కోట్లు రాబట్టినా త్రివిక్రమ్ పై అనుమానమే.. మహేష్ సినిమా ఆలస్యానికి కారణం ఏమిటంటే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి అని నేటితరం హీరోలు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మహేష్ బాబు మాత్రం ఆ దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి ఎంతగానో ఆలోచించినట్లు అర్థమవుతుంది. బాక్సాఫీస్ వద్ద వరుసగా రెండు సినిమాలతో వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్నప్పటికీ కూడా త్రివిక్రమ్ ను అంత ఈజీగా నమ్మడం లేదు. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

మహేష్ తో రెండు సినిమాలు

మహేష్ తో రెండు సినిమాలు

మహేష్ బాబుతో ఇదివరకే త్రివిక్రమ్ రెండు సినిమాలు కూడా చేశాడు. మొదటి సినిమా అతడు బాక్సాఫీస్ వద్దనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మహేష్ మరొక అవకాశం ఇచ్చాడు. మహేష్ బాబుతో ఖలేజా అనే సినిమా చేసిన త్రివిక్రమ్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా అపజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సినిమా ప్రస్తుతం టీవీల్లో మంచి రేటింగ్స్ అందుకుంటుంది కానీ ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఆ దెబ్బ తరువాత

ఆ దెబ్బ తరువాత

ఇక తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లతో మళ్లీ సినిమాలు చేసి ఫామ్ లోకి వచ్చేసాడు. జులాయి అత్తారింటికి దారేది ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత మళ్లీ అజ్ఞాతవాసి సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నప్పటికీ వెంటనే అరవింద సమేత సినిమాతో ఫామ్ లోకి వచ్చేసాడు.

బిగ్గెస్ట్ హిట్

బిగ్గెస్ట్ హిట్

అరవింద సమేత సినిమా తర్వాత అల్లు అర్జున్ తో అల..వైకుంటపురములో అనే సినిమా తీసిన త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను చూశాడు. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో కూడా మొదటిసారి రెండు వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. దాదాపు నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద 250 కోట్లను సొంతం చేసుకోవడంతో త్రివిక్రమ్ స్థాయి మరో లెవల్ కు వెళ్ళిపోయింది.

ఎన్టీఆర్ తో క్యాన్సిల్

ఎన్టీఆర్ తో క్యాన్సిల్

అయితే ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎన్టీఆర్ కూడా సినిమాను లాంచ్ చేయడానికి రెడీ అవుతున్న తరుణంలో అనుకోకుండా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఎన్టీఆర్ రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేసిన అనంతరం మళ్లీ అదే తరహాలో పాన్ ఇండియా సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు.

 అనేకసార్లు చర్చలు

అనేకసార్లు చర్చలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత వెంటనే మహేష్ బాబును లైన్లోకి తీసుకువచ్చాడు. అయితే మొదట ఒక చిన్న లైన్ చెప్పి ఒప్పించిన త్రివిక్రమ్ ఫుల్ స్క్రిప్ట్ తో ఒప్పించేందుకు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేసినట్లు అర్థమవుతుంది. ఎందుకంటే మహేష్ బాబుతో ఇదివరకే చాలాసార్లు స్క్రిప్ట్ పై చర్చలు జరిపినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేకపోయాడట ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు వెళ్లిన త్రివిక్రమ్ దుబాయ్ లో ఉన్నప్పుడు కూడా ఒకసారి కలిసి కథ గురించి చర్చలు జరిపాడు.

మొత్తానికి గ్రీన్ సిగ్నల్

మొత్తానికి గ్రీన్ సిగ్నల్

అమెరికా నుంచి ఇటీవల ఇండియాకు వచ్చిన మహేష్ బాబు మొత్తానికి త్రివిక్రమ్ కథకు సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో ఎదురైనా కొన్ని చేదు అనుభవాల కారణంగా మహేష్ బాబు కథ విషయంలో చాలా సీరియస్ గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత ఫుల్ స్క్రిప్ట్ చెబితే గాని దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇక ఇండస్ట్రీ రికార్డును అందుకున్నటువంటి త్రివిక్రమ్ తో కూడా అదే తరహాలో ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక వీరే కలయికలో రాబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇదే నెల చివరలో స్టార్ట్ కాబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X