For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్, త్రివిక్రమ్ కాంబోపై మరో ఇంట్రెస్టింగ్ పాయింట్.. అలాంటిదాన్ని టచ్ చేస్తే హిట్టే!

  |

  సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ తీసిన ఫస్ట్ మూవీ అతడు కల్ట్ క్లాసిక్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఇప్పటికీ ఎన్ని సార్లు బుల్లితెరపై ప్రసారం అయినప్పటికీ కూడా ఎంతో మంచి రేటింగ్స్ దక్కించుకుంటూ ఉంటుంది. అలాగే ఖలేజా సినిమాకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ బిగ్ కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ కాంబినేషన్ కు సంబంధించిన ఎదో ఒక రూమర్ నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఇటీవల మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయినట్లు తెలుస్తోంది.

  అతడు, ఖలేజా

  అతడు, ఖలేజా

  అతడు సినిమాకి అయితే ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్, త్రిష హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కొట్టింది. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళి మోహన్ ఈ మూవీని నిర్మించారు. అయితే ఆ తరువాత ఐదేళ్ల గ్యాప్ అనంతరం 2010లో మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ ల కంబోలో వచ్చిన సినిమా ఖలేజా. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా దీనిని సి కళ్యాణ్, సింగనమల రమేష్ బాబు ఎంతో భారీ గా నిర్మించారు. కానీ ఈ మూవీ మాత్రం అంచనాలు అందుకోలేక ఫ్లాప్ గా నిలిచింది.

  11 ఏళ్ళ గ్యాప్ తరువాత

  11 ఏళ్ళ గ్యాప్ తరువాత

  అయితే ఖలేజా మూవీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలిచినప్పటికీ కూడా ఈ మూవీలో కామెడీ, మరీ ముఖ్యంగా మహేష్ బాబు పలికే వన్ లైన్ డైలాగ్స్ ఇప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ మనసులో నిలిచిపోయాయి. ఇక అసలు విషయం ఏమిటంటే, ఇక 11 ఏళ్ళ గ్యాప్ తరువాత మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ తో మళ్ళి సినిమా చేయడానికి రెడీ అయ్యారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

  రివెంజ్ డ్రామా..

  రివెంజ్ డ్రామా..

  ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనుండగా యువ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ భారీ మూవీ నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ సినిమాకి సంబందించి ఒక న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని త్రివిక్రమ్ మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ జానర్ లో తీయాలని నిర్ణయించారట. రివెంజ్ డ్రామా మూవీగా ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ మూవీ తెరకెక్కనుందట.

  Real Secret Behind Sudheer Babu Six Pack
  త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ

  త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ

  గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడుని మించేలా మరింత అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ని త్రివిక్రమ్ సిద్ధం చేసారని అంటున్నారు. అలానే ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా అదిరిపోయేలా ఉండడనున్నాయట. త్రివిక్రమ్ కెరీర్ లో అయితే ఇదే భారీ బడ్జెట్ మూవీ కానుందట. ఇప్పటికే పలువురు హాలీవుడ్ టీమ్ ని సిద్ధం చేసిన త్రివిక్రమ్, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సూపర్ స్టార్ తో చేయబోయే ఈ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక మహేష్ కూడా త్వరలో సర్కారు వారి పాట మూవీ షూట్ పూర్తి చేసి అనంతరం త్రివిక్రమ్ మూవీ కోసం మేకోవర్ పరంగా సిద్ధం కానున్నారని సమాచారం. కాగా ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ఛాన్స్ ఉందని సమాచారం.

  English summary
  Mahesh babu trivikram srinivas project latest gossip on behind the story
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X