హాట్ టాపిక్: మాటల మాంత్రికుడితో మహేష్ సినిమా లేనట్లేనా?
స్టార్ కాంబినేషన్స్ సెట్స్ పైకి రాబోతున్నాయనే చిన్న వార్త వస్తే చాలు అభిమానుల మదిలో ఒక స్పెషల్ జోష్ మొదలవుతుంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోపై కూడా అలాంటి నమ్మకాలు ఎక్కువవుతున్నాయి. గతంలో అతడు, ఖలేజా సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ జోడి మూడోసారి కలిసి పనిచేస్తే చూడాలని అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.
గత వారం వరకు ఆ కాంబినేషన్స్ కి సంబంధించిన అనేక రకాల రూమర్స్ హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా గ్యాప్ దొరకడంతో మహేష్ బాబు కోసం కూడా త్రివిక్రమ్ ఒక స్పెషల్ కథను రెడీ చేసినట్లు టాక్ వచ్చింది. ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. మహేష్ ఎప్పుడైనా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వవచ్చనే కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ ఇప్పుడు అవేవి నిజం కాదని టాక్ కూడా వస్తోంది.

మహేష్ సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రస్తుతం సూపర్ స్టార్ బిజీగా ఉండడం వలన మరో సినిమా ఓకే చేసే అవకాశం లేదని తెలుస్తోంది. సర్కారు వారి పాట అయిపోవడానికి ఏడాది సమయం పడుతుంది. ఇక ఆ తరువాత రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయాలి కాబట్టి ఆయన కోసం మహేష్ వీలైనంత వరకు సిద్ధమై ఉండాలి.
అందుకే ఇప్పుడే వేరే కథలు వినాలని అనుకోవడం లేదట. ఓకేవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా రాజమౌళి సినిమా తరువాతే ఉంటుందట. ఫైనల్ గా మహేష్ బిజీ షెడ్యూల్ ని బట్టి గమనిస్తే ఇప్పట్లో త్రివిక్రమ్ తో వర్క్ చేసే అవకాశం లేదని అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











