SSMB28: మహేశ్ బాబు క్రేజ్.. భారీ ధరకు సినిమా నైజాం రైట్స్.. దిల్ రాజు అన్ని కోట్లు పెట్టాడా?

బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేశ్ బాబు. అనేక చిత్రాలతో అలరించిన మహేశ్ బాబు ఈ మధ్య కాలంలో 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవాను చూపించాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాయి.

అయితే, గతేడాది విడుదలైన 'సర్కారు వారి పాట' మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మహేశ్ బాబు దూసుకుపోతున్నాడు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 సినిమాతో రాబోతున్నాడు మహేశ్ బాబు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే నైజాం థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి.

ఇద్దరు హీరోయిన్లతో..

ఇద్దరు హీరోయిన్లతో..

సినిమా ఫలితాలు ఎలా ఉన్నా సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలు చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ సినిమాతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డేతో పాటు తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల కూడా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలున్నాయి.

ఫిబ్రవరిలో మొదలు..

ఫిబ్రవరిలో మొదలు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ గా తెరపైకి రాబోతున్న మహేశ్ బాబు SSMB28 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇటీవల ఈ సినిమా చిత్రీకరణను జనవరి 18 నుంచి పునః ప్రారంభించిన నిర్విరామంగా కొనసాగిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరిలో మొదలు పెడతామని చెప్పి షాక్ ఇచ్చారు.

దసరాకు అయితే బాగుంటుందని..

దసరాకు అయితే బాగుంటుందని..

అంతేకాకుండా త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా SSMB28ని అక్టోబర్ 18న కానీ, 20న కానీ విడుదల చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. అంటే విజయదశమి దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

లాంగ్ వీకెండ్, ఫెస్టివల్ డేస్ కారణంగా అలా అయితే సినిమాకు బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఇక మొదటగా అనుకున్నట్లుగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కాకుండా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ఫీస్ట్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.

రూ. 50 కోట్లకు హక్కులు..

రూ. 50 కోట్లకు హక్కులు..

ఇదిలా ఉంటే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ముగింపు దశకు రానేలేదు. కానీ అప్పుడే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు తీవ్రమైన పోటీ నెలకొంది. విపరీతమైన ఈ పోటీని తట్టుకుని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమా నైజాం రైట్స్ ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28 చిత్రం నైజాం థియేట్రికల్ హక్కులను రూ. 50 కోట్లు పెట్టి చేజిక్కుంచుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

విలన్ గా జగపతి బాబు..

విలన్ గా జగపతి బాబు..

ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఇక, ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. కానీ వారి గురించి వివరాలు అధికారికంగా అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇందులో విలన్ గా సీనియర్ హీరో జగపతి బాబు నటిస్తున్నట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X