గుంటూరు కారంలో మహేశ్ బాబు పాట: సినిమాలో అసలైన హైలైట్ ఇదేగా!

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక ప్రభంజనం. అంతలా ఈ బడా హీరో సుదీర్ఘ కాలంగా తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో అలరిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. దీనికితోడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ మార్కెట్, ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నాడు. ఈ జోష్‌లోనే ఎన్నో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.

భారీ హిట్ కోసం చూస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు 'గుంటూరు కారం' అనే సినిమాలో నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీంతో దీనిపై హైప్ మరింతగా పెరిగిపోతోన్నాయి.

Mahesh Babu Turns Singer for Sreeleela in Guntur karam Movie

దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురు కావడంతో షూటింగ్ సజావుగా సాగట్లేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఈ మూవీ షూట్ శరవేగంగా జరుగుతూ దీన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమాలో మహేశ్ బాబు 'ఒక్కడు' సినిమాలోని 'చెప్పవే చిరుగాలి' అనే పాటను పాడుతాడట. ఈ సీన్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే విధంగా ఉంటుందని తెలిసింది.

Mahesh Babu Turns Singer for Sreeleela in Guntur karam Movie

'గుంటూరు కారం' మూవీలో హీరోయిన్ శ్రీలీలను ఫ్లాట్ చేయడం కోసం మహేశ్ బాబు ప్రయత్నాలు చేస్తుంటాడట. ఆ సందర్భంలోనే అతడు ఈ పాటను పాడతాడని తెలిసింది. ఈ సన్నివేశం చూసిన ఫ్యాన్స్‌కు థియేటర్లలోని సీట్లలో కూర్చోలేనంతగా దీన్ని డిజైన్ చేశారని అంటున్నారు. అంటే ఈ సినిమాలోని హైలైట్ అయ్యే అంశాల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X